రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు(Co-ordinators), రీజనల్ ఇన్‌ఛార్జిలు (Regional In-charges) అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైసీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) ఆదేశించారు. కూటమి ప్రభుత్వం (Coalition Government) తన అధికార బలాన్ని దుర్వినియోగం చేస్తూ, వైసీపీకి అనుకూలంగా ఉండే ఓట్లను ఏదో ఒక రకంగా తొలగించేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులతో నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకమని స్పష్టం చేసిన వైఎస్ జగన్.. ఓట్ల సవరణ (Vote Revision) విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. SIR ప్రక్రియ క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరుపై నియోజకవర్గాల (Constituencies) వారీగా ప్రతిరోజూ సమీక్షలు నిర్వహించాలని వైఎస్ జగన్ సూచించారు. ఎక్కడైనా అక్రమాలు (Irregularities) లేదా తప్పులు జరుగుతున్నాయని గమనిస్తే, వెంటనే సంబంధిత ఎన్నికల అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. స్థానిక అధికారుల స్థాయిలోనే సమస్య పరిష్కారం కాకపోతే, ఆ విషయాన్ని వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.
ఓట్ల సవరణ ప్రక్రియలో ఒక్కసారి ఓటు (Vote) తొలగించబడితే, దాన్ని మళ్లీ ఓటరు జాబితాలో (Voter List) చేర్పించడం అత్యంత కష్టంతో కూడుకున్న పని. ఈ విషయాన్ని ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త తీవ్రంగా పరిగణించాలి అని వైఎస్ జగన్ ఆదేశించారు.
చంద్రబాబు అధికార దుర్వినియోగం
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై (Nara Chandrababu Naidu) వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి పోలింగ్ బూత్‌లో (Polling Booth) కనీసంగా 50 వైసీపీ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా అధికార పక్షం వ్యూహాలు రచిస్తోందన్నారు. గిమ్మిక్కులు చేయడం ద్వారా, అక్రమ పద్ధతుల్లో ఓట్లను తొలగించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని దుయ్యబట్టారు. ఇలాంటి తప్పుడు ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన బాధ్యత వైసీపీ(YSRCP) కోఆర్డినేటర్లు(Co-ordinators), బూత్ లెవల్ ఏజెంట్లపైనే (Booth Level Agents) ఉందన్నారు. క్షేత్రస్థాయిలో నిరంతర నిఘా ఉంచుతూ, పార్టీకి చెందినా ప్రతి ఒక్క ఓటునూ కాపాడుకోవాలని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.








అనగానే సరిపోతుందా.. స్వీకరించే దమ్ముండొద్దు..!!