అనంతపురం జిల్లా శింగనమల(Singanamala) ఎంపీపీ(MPP) పదవి ఎన్నిక ఉత్కంఠగా మారింది. మండలంలో వైసీపీ(YSRCP), టీడీపీ(TDP) చెరో ఆరు ఎంపీటీసీ(MPTC) స్థానాలను గెలుచుకోవడంతో ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు ఇరుపార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మాజీ మంత్రి శైలజానాథ్‌ను(Shailajanath) అడ్డుకున్న పోలీసులు.. టీడీపీ ఎమ్మెల్యేలు బండారు శ్రావణి(Bandaru Shravani), ఎంఎస్ రాజులను(MS Raju) మాత్రం లోపలికి అనుమతించారు. పోలీసుల తీరుపై శైలజానాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు శింగనమల, మడకశిర ఎమ్మెల్యేలు కార్యాలయం లోపల తిష్టవేసి ఎంపీటీసీ సభ్యులను బెదిరిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని శైలజానాథ్ మండిపడ్డారు. వైసీపీ నాయకులను బయట అడ్డుకుని టీడీపీ ఎమ్మెల్యేలను లోపలికి అనుమతించడం ఏంటని ప్రశ్నించారు. ‘జై జగన్(Jai Jagan) అని చెప్పమను.. మేమే వాళ్లకు పదవీ భిక్షం వేస్తాం’ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి సవాల్ విసిరారు.








