చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష ఖరారు!

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష ఖరారు!

Summarize with AI

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు (Bandla Ganesh) చెక్ బౌన్స్ కేసులో(Cheque Bounce) ఒంగోలు కోర్టులో(Ongole Court) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో విధించిన ఏడాది సాధారణ జైలు శిక్షను (One Year Simple Imprisonment) సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్‌ను ఒంగోలులోని రెండో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు కొట్టివేసింది. దీంతో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, శిక్షను ఖరారు చేసింది. అంతేకాకుండా, నాలుగు వారాల్లోగా ట్రయల్ కోర్టు (Trial Court) ఎదుట లొంగిపోవాలని బండ్ల గణేశ్‌ను ఆదేశించింది.

ఈ కేసు 2018లో జరిగిన ఆర్థిక లావాదేవీలకు (Financial Transactions) సంబంధించినది. ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు చెందిన జెట్టి జానకి రామయ్య కుటుంబానికి (Jetti Janaki Ramaiah’s Family) రూ.95 లక్షల బకాయి చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తానికి సంబంధించి బండ్ల గణేశ్ తన నిర్మాణ సంస్థ ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’(Parameswara Art Productions)పేరిట చెక్ జారీ చేశారు. అయితే, బ్యాంకు ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయింది. దీంతో బాధితుడు జెట్టి వెంకటేశ్వరరావు (Jetti Venkateswara Rao) కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం 2024 ఫిబ్రవరి 14న కింది కోర్టు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ.95.10 లక్షల జరిమానా విధించింది. ఇందులో రూ.95 లక్షలను ఫిర్యాదుదారుడికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. తాజాగా అప్పీల్ కొట్టివేయడంతో ఈ తీర్పు మరోసారి వార్తల్లో నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment