తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. కొలత్తూరు (Kolathur) నియోజకవర్గంలో డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను (MK Stalin) ఓడించి సంచలనం సృష్టించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు (VS Babu) (75) కన్నుమూశారు(Passed Away). తీవ్ర శ్వాసకోశ సమస్యలతో(Respiratory Problems) బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 9 నుంచి చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ (MGM Healthcare) ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో గురువారం మధ్యాహ్నం 2.24 గంటలకు గుండెపోటుతో(Heart Attack) తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
వీఎస్ బాబు తన రాజకీయ ప్రస్థానాన్ని డీఎంకేతో ప్రారంభించి, 2006లో పురసవాక్కం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం అన్నాడీఎంకేలో చేరిన ఆయన, ఈ ఏడాది టీవీకేలోకి(TVK) మారారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నుంచి పోటీ చేసి 82,997 ఓట్లు సాధించారు. స్టాలిన్‌పై 8,795 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బాబు మరణంతో తమిళనాడు అసెంబ్లీలో ఖాళీ అయిన స్థానాల సంఖ్య ఆరుకు చేరింది.








