తమిళనాడు (Tamil Nadu) పరిశ్రమల శాఖకు(Industries Department) సంబంధించిన కీలక విధానపరమైన సమాచారం, పెట్టుబడుల రహస్యాల లీక్ (Investment Secrets Leak) వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పార్టనర్షిప్ సమ్మిట్(Partnership Summit) నేపథ్యంలో తమిళనాడు పెట్టుబడుల సమాచారం ఏపీకి చేరాయన్న ఆరోపణలు పెను సంచలనంగా మారాయి. ఈ వ్యవహారం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.
తమిళనాడు పరిశ్రమల శాఖ పరిధిలోని ‘గైడెన్స్ తమిళనాడు'(Guidance Tamil Nadu) సంస్థకు చెందిన 15 మంది ఉద్యోగులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. తమిళనాడు పరిశ్రమల శాఖలోని పెట్టుబడులకు సంబంధించిన కీలక రహస్యాలను ఏపీకి చేరవేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామంతో తమిళనాడు సీఎం విజయ్, ప్రతిపక్ష డీఎంకే (DMK) అధినేత స్టాలిన్ (Stalin) మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది. ప్రభుత్వంలోని లోపాలను, డేటా లీక్ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుని డీఎంకే(DMK) నేతలు విజయ్ ప్రభుత్వంపై (Vijay Government) తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ డేటా లీక్ (Data Leak) వ్యవహారంలో మరో కీలక అంశం ఇప్పుడు చర్చకు దారితీసింది. ప్రస్తుతం తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కీర్తన, గత ఎన్నికల్లో, ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్న రాబిన్ శర్మ ‘(Robin Sharma)షో టైమ్’ కన్సల్టెన్సీలో(Show Time Consultancy) పనిచేసిన వ్యక్తి కావడం గమనార్హం.
15 మంది ఉద్యోగులపై వేటు వేసినప్పటికీ, అసలు తమిళనాడు పరిశ్రమల డేటాను ఏపీకి ఎవరు లీక్ చేశారనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డేటా లీక్ కారణంగా దక్షిణ కొరియాకు చెందిన మూడు కంపెనీల నుంచి తమిళనాడు రూ.1,614 కోట్ల పెట్టుబడులు కోల్పోయినట్టుగా ప్రాథమిక అంచనా.








