తెలంగాణను(Telangana) సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రాన్ని ‘క్యూర్’(CURE), ‘ప్యూర్’(PURE), ‘రేర్’(RARE) అనే మూడు రీజియన్లుగా (Three Regions) విభజించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల (One Trillion Dollars) ఆర్థిక వ్యవస్థగా(Economy), 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల (Three Trillion Dollars) ఎకానమీగా(Economy) తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించారు. గురువారం నిర్వహించిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (Indian Roads Congress) కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ఓఆర్ఆర్ (ORR) పరిధిలోని ప్రాంతాన్ని ‘క్యూర్’గా గుర్తించి సేవా రంగానికి(Service Sector), ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road – RRR) వరకు ఉన్న ప్రాంతాన్ని ‘ప్యూర్’గా పరిగణించి తయారీ రంగానికి (Manufacturing Sector) ప్రాధాన్యత ఇస్తామని సీఎం వివరించారు. ఆర్ఆర్ఆర్ వెలుపల ఉన్న ప్రాంతాన్ని ‘రేర్’గా అభివృద్ధి చేస్తూ వ్యవసాయం(Agriculture), వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రహదారులతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, కొత్త ఉస్మానియా ఆసుపత్రి, టిమ్స్ తదితర ఆసుపత్రుల ద్వారా మొత్తం 8,000 పడకలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.
దేశ భద్రత, జాతి ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు తావులేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’(Invest Telangana Global Summit)నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సదస్సు రాష్ట్ర అభివృద్ధికి, పెట్టుబడుల సాధనకు కీలకంగా నిలుస్తుందని పేర్కొంటూ పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు పాల్గొనాలని ఆహ్వానించారు.








