బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ (K3G) సినిమా జ్ఞాపకాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది Airbnb. సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘At Home with the Raichands’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా కరీనా కపూర్ ఖాన్(Kareena Kapoor Khan), హృతిక్ రోషన్ (Hrithik Roshan) తమ ఐకానిక్ పాత్రలైన ‘పూ’,(Poo) ‘రోహన్’(Rohan)రూపంలో కనిపించి అభిమానుల్లో పాత జ్ఞాపకాలను తట్టిలేపుతున్నారు. పూ అంటే గుర్తొచ్చే లిప్‌గ్లాస్ స్టైల్, రోహన్ కూల్ లుక్‌ను గుర్తుచేసే ప్రచార చిత్రాలు, వీడియోలు ఇప్పటికే ఆసక్తిని పెంచుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ ఇద్దరినీ మరోసారి ఒకే తెరపై చూడాలని కోరుకుంటున్నారు.
ఈ వేడుకలో భాగంగా డిసెంబర్ 1 నుంచి 6 వరకు ముంబైలోని(Mumbai) రైచంద్‌ల ఇంటి ప్రత్యేక అనుభవాన్ని అభిమానులు ఆస్వాదించవచ్చు. రెండు గంటల పాటు సాగే ఈ సందర్శనలో ఆ ఇంటి గ్రాండ్ మెట్ల మార్గం, ఫ్యామిలీ స్టడీతో పాటు పూ ప్రత్యేక వార్డ్‌రోబ్‌ను (Poo’s Special Wardrobe) చూసే అవకాశం ఉంటుంది. ఆడియో టూర్, సరదా ఛాలెంజ్‌లు కూడా ఈ అనుభవంలో భాగంగా ఉండనున్నాయి. ఈ అవకాశం పూర్తిగా ఉచితం అయినప్పటికీ, కేవలం 180 మందికి మాత్రమే పరిమితం చేశారు. నవంబర్ 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి Airbnbలో బుకింగ్ అభ్యర్థనలు స్వీకరించనున్నారు. ఇది కరీనా, హృతిక్, కరణ్ జోహార్ పాల్గొనే సినిమా రీయూనియన్ కాకపోయినా.. 25 ఏళ్ల క్రితం ప్రేక్షకులను అలరించిన రైచంద్ కుటుంబ ప్రపంచంలోకి మరోసారి అడుగుపెట్టే అరుదైన అవకాశం కావడంతో K3G అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.








