తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP)అనుకూల మీడియా వైఖరిపై, విచారణల పేరుతో చేసే ప్రచారాలపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ (PV Sunil Kumar) తీవ్రస్థాయిలో చెలరేగిపోయారు. ముంబై నటి (Mumbai Actress) కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani) వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బద్నాం చేయడానికి టీడీపీ(TDP) అనుకూల మీడియా చేసిన ప్రయత్నాలపై సోషల్ మీడియా వేదికగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాడు పూజ్యమాత.. నేడు కిలాడీనా?
సిఐడి (CID)విచారణ నివేదికను ఉదహరిస్తూ ఎల్లో మీడియా చేసిన ప్రచారాలపై పీవీ సునీల్‌కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. “సరిగ్గా రెండేళ్ల క్రితం జెత్వానీని అడ్డం పెట్టుకుని ఒక పెద్ద డ్రామా ఆడారు. ముంబైలో ఉన్న జెత్వానీ మహాసాధ్వి, పూజ్యమాత అని, అలాంటి అమాయకురాలిని ఏపీ (Andhra Pradesh) పోలీసులు(Police) వేధించారంటూ పచ్చ మీడియా కథనాలు రాసి ప్రజలను మభ్యపెట్టింది” అంటూ మాజీ ఐపీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వంలోనే (Coalition Government) సీఐడీ జరిపిన పూర్తిస్థాయి విచారణలో జెత్వానీ ఒక అతిపెద్ద ‘కిలాడీ'(Mastermind) అని తేలిందని, ఇప్పుడు ఆ మీడియా సమాధానం ఏం చెప్తుందని ప్రశ్నించారు. “మీకు రాజకీయాలు ఉంటే మీరు మీరు చూసుకోవాలి. అనవసరంగా అధికారులను మధ్యలోకి ఎందుకు లాగుతారు? టీవీ డిబేట్లలో ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకుంటూ అబద్ధాలను ప్రచారం చేశారు అంటూ ఎద్దేవా చేశారు.
దళిత నాయకులపై (Dalit Leaders), తమ పార్టీకి చెందని వారిపై సదరు కులపిచ్చి మీడియా నిరంతరం విషం చిమ్ముతోందని పీవీ సునీల్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మందకృష్ణ మాదిగ మొదలుకుని మాయావతి వరకు దళిత నాయకులను టార్గెట్ చేయడం ఆ మీడియాకు అలవాటుగా మారిందన్నారు.
ముఖ్యంగా టీడీపీ(TDP) అనుకూల పత్రికలు, ఛానళ్ల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ఒకాయన తమది ‘దమ్మున్న ఛానెల్’ అని చెప్పుకుంటాడు. అవును.. ఇన్ని అబద్ధాలు, ఇన్నిసార్లు చెప్పాలంటే నిజంగానే పెద్ద దమ్ముండాలి, మీరెప్పుడూ నిజాలు చెప్పరు. కానీ గుర్తుపెట్టుకోండి.. అన్ని కాలాలూ మీవే అయివుండవు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సునీల్‌కుమార్ ఆగ్రహం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి?
పీవీ సునీల్‌కుమార్ ఇంత తీవ్రంగా స్పందించడం వెనుక బలమైన ఆక్రోశం ఉందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. గతంలో ఆయన కుటుంబ విషయాలు ఆధారంగా సదరు మీడియా ఇష్టానుసారంగా కథనాలు అల్లడం, ఇటీవల ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు వెళ్లినట్లు వార్తలు రాయడం వంటి పరిణామాలు ఆయన్ను తీవ్రంగా మనస్తాపానికి గురిచేశాయని సమాచారం.
ఇప్పుడు జెత్వానీ కేసులో పచ్చ మీడియా రాసిన కథనాలన్నీ పచ్చి అబద్ధాలని సీఐడీ రిపోర్టుతో తేలిపోవడంతో, ఆ నివేదికనే ఆయుధంగా మలుచుకుని పీవీ సునీల్‌కుమార్ టీడీపీ అనుకూల మీడియాపై సరైన సమయంలో దెబ్బకొట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు.








