భూమిని కోల్పోయి.. రెండోరోజే అమరావతి రైతు మృతి

భూమిని కోల్పోయిన రెండోరోజే అమరావతి రైతు మృతి

Summarize with AI

రాజధాని అమరావతి (Amaravati) పేరుతో సాగుతున్న భూసేకరణ (Land Acquisition) మరో రైతు (Farmer) ప్రాణాన్ని (Life) బలితీసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ (Undavalli Village) పరిధిలో ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ చర్యలు తీవ్ర విషాదాన్ని నింపాయి. శనివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ అధికారులు బుల్డోజర్లతో (Bulldozers) పంటలను ధ్వంసం చేయగా.. ఆ ఆవేదనను తట్టుకోలేక గుంటక పద్మారెడ్డి (Guntaka Padma Reddy) అనే రైతు రెండు రోజుల్లోనే కన్నుమూశారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

శనివారం స్పిల్‌వే రోడ్డు నిర్మాణం (Spillway Road Construction) కోసం ఉండవల్లిలో రైతుల(Farmers) నుంచి భూములు సేకరించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. తాము తరతరాలుగా నమ్ముకున్న సాగు భూములను ఇచ్చేది లేదని రైతులు తీవ్రంగా అడ్డుకున్నారు. భారీగా పోలీసులను మోహరించి, రైతుల పొలాల్లోకి (Farmers’ Fields) బుల్డోజర్లను పంపి పచ్చని పంటలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేయించారు.

తనకున్న ఎకరం 40 సెంట్ల భూమిని కాపాడుకోవడానికి శనివారం ఆందోళనలో పాల్గొన్న రైతుల్లో గుంటక పద్మారెడ్డి ఒకరు. కళ్లముందే జీవనాధారమైన భూమి(Land) లాక్కోవడాన్ని, పంటలు నాశనం (Crops Destroyed) కావడాన్ని చూసి తీవ్ర మనస్తాపానికి గుర‌య్యాడ‌ని పద్మారెడ్డి కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఆ ఘోరం జరిగిన రెండో రోజే మృతి చెందడం సంచ‌ల‌నంగా మారింది.

గతంలోనూ మందడంలో మంత్రి నారాయ‌ణ (Narayana) నిర్వ‌హించిన గ్రామసభలో రాజధాని భూముల కేటాయింపులపై నిలదీస్తూ రైతు రామారావు గుండెపోటుతో మరణించిన విషయాన్ని ఈ సందర్భంగా రైతులు గుర్తు చేస్తున్నారు. రైతుల ప్రాణాలు ఫ‌ణంగా సాగుతున్న ఈ భూసేకరణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “రాజధాని కోసం భూములు ఇస్తే.. మెయిన్ రోడ్డుపై, నివాస ప్రాంతాల్లో ఇస్తామన్న రిటర్నబుల్ ప్లాట్లను కాకుండా.. చెరువుల్లో, కాలువల్లో ఇస్తున్నారని మంత్రిని, స్థానిక ఎమ్మెల్యేను ప్ర‌శ్నిస్తూ రైతు రామారావు గుండెపోటుతో మృతిచెందిన విష‌యాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

ఇది ఒక్క పద్మారెడ్డి సమస్య కాదు.. – వైసీపీ నేత వేమారెడ్డి
రైతు పద్మారెడ్డి భౌతికకాయానికి వైసీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి (Donthireddy Vema Reddy) నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై (Alliance Government) తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. పద్మారెడ్డికి ఉన్న ఎకరం 40 సెంట్ల భూమికి కూడా ప్రభుత్వం బలవంతంగా ల్యాండ్ పూలింగ్ (Land Pooling) నోటీసులు ఇచ్చి వేధించింది. భూమే రైతు కుటుంబానికి తరతరాల జీవనాధారం. కోర్టుల్లో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నా శని, ఆదివారాలు చూసుకుని బుల్డోజర్లతో రావడం దుర్మార్గం. దానిని వదులుకోవడానికి ఏ రైతు ఒప్పుకోడు. ఇది ఒక్క పద్మారెడ్డి సమస్య కాదు, భూములు ఇవ్వని అందరి ఆవేదన అని వేమారెడ్డి అన్నారు.

రైతులపై బురదజల్లడం మాని ప్రభుత్వం తక్షణమే వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని వైసీపీ(YSRCP) డిమాండ్ చేసింది. బలవంతపు భూసేకరణ ఆపకపోతే, బాధిత రైతు కుటుంబాలకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో రైతుల పక్షాన నిలబడి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని దొంతిరెడ్డి వేమారెడ్డి హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment