పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ పేపర్ల తరలింపు, కాల్పులతో కలకలం

పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ పేపర్ల తరలింపు, కాల్పులతో కలకలం

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్న వేళ పలు జిల్లాల్లో ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. వివిధ జిల్లాల్లో చోటుచేసుకున్న పరిణామాలు కలకలం రేపాయి. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడం, దాడులు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉల్లగళ్లులో బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకెళ్లేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకెళ్తున్న టీడీపీ నాయకులను వైసీపీ సానుభూతిపరులు అడ్డుకున్నారు. బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకెళ్లి ఓట్లు వేసుకునేందుకు కుట్ర చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వద్ద నుంచి బ్యాలెట్ పేపర్లను తీసుకున్న వైసీపీ బలపరిచిన అభ్యర్థి వాటిని మీడియాకు చూపిస్తూ జరిగిన పరిణామాలను ప్రశ్నించారు.

వైఎస్సార్ జిల్లాలోని పెద్దలేబాకలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి రాకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల సమక్షంలోనే కర్రలతో దాడి ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరోవైపు బాపట్ల జిల్లా బచ్చులవారిపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్తరెడ్డిపాలెంకు చెందిన ఓటర్ల ఓట్లను ఇతరులు వేశారంటూ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమంచి కృష్ణమోహన్ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment