‘డిప్యూటీ సీఎంవా.. చంద్రబాబు డిఫెన్స్ లాయర్‌వా?’ – వైసీపీ ప్రశ్న

'డిప్యూటీ సీఎంవా.. చంద్రబాబు డిఫెన్స్ లాయర్‌వా?' - వైసీపీ ప్రశ్న

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఇటీవల చోటుచేసుకున్న కస్టోడియల్ మరణాల (లాకప్ డెత్‌లు) (Lockup Deaths)ఉదంతాలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాపు యువకుడు సాయికృష్ణ(Sai Krishna, ద‌ళిత‌ యువకుడు క్రాంతికుమార్(Kranthi Kumar), కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ(Gangamma), విజయనగరం జిల్లాలో కళావతి, శ్రీకాకుళం జిల్లాలో తిరుపతమ్మ వంటి వారి మరణాలు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

ఈ తీవ్రమైన శాంతిభద్రతల అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రతిపక్ష వైసీపీ(YSRCP) డిమాండ్ చేస్తోంది. అయితే, ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న శైలి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుబడుతూ వైసీపీ పదునైన ప్రశ్నలు సంధిస్తోంది.

లా అండ్ ఆర్డర్‌తో పవన్‌కు ఏం సంబంధం?
వైసీపీ లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న.. ఈ కేసులతో పవన్ కళ్యాణ్‌కు ఉన్న సంబంధం ఏంటి? రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సింది ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ(DGP). విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో జరిగిన ఘటనలపై వారు సమాధానం చెప్పాలి. కానీ, బాధ్యత గల పదవుల్లో ఉన్నవారు మౌనం వహిస్తుంటే, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందిస్తున్నారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న.

గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ నిధులపై దృష్టి పెట్టాల్సిన డిప్యూటీ సీఎం.. తన శాఖను వదిలేసి చంద్రబాబు(Nara Chandrababu Naidu) రాజ్‌ను(Raj) కాపాడేందుకు ‘డిఫెన్స్ లాయర్’లా (Defence Lawyer) వ్యవహరిస్తున్నారని వైసీపీ(YSRCP) విమ‌ర్శిస్తోంది. అసలు ప్రశ్నల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.

“డిప్యూటీ సీఎం అంటే రాజ్యాంగానికి, సమాజానికి అతీతమైన పదవా?” అని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. అధికారం ఉందనే అహంకారంతో పవన్ కళ్యాణ్, జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వాడుతున్న భాష జుగుప్సాకరంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ప‌నిచేశార‌ని, పవన్ కళ్యాణ్‌కు ఏమైనా ప్రత్యేక రాజ్యాంగ అధికారాలు ఉన్నాయా అని నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు.

“తప్పు చేసినా నడిరోడ్డుపై శిక్షించే అర్హత ఎవరికీ లేదు, చట్టాన్ని గౌరవించాలి” అని గ‌తంలో మాట్లాడిన పవన్‌కు, అధికారం రాగానే రౌడీ భాష ఎందుకు గుర్తొచ్చిందని నిలదీస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసే శక్తి లేని జనసేన, కేవలం టీడీపీకి(TDP) రాజకీయ రక్షణ కవచంగా మారిందని ప్రతిపక్షం అంటోంది.

ఒకప్పుడు ప్రత్యేక హోదా అన్నారని, మరో రోజు టీడీపీని తిట్టారని, ఇప్పుడు అదే బాబు కోసం, బాబు కొరకు అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒక స్పష్టమైన దిశ, విధానం లేని జనసేన(Jana Sena) అధినేత.. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే అదుపులో పెట్టుకోలేకపోతున్నారని, అలాంటిది రాష్ట్ర రాజకీయాలకు నీతులు చెప్పడం ఎంతవరకు సమంజసమని విమర్శిస్తున్నారు.

ఎన్నికల వరకు కాపు సామాజికవర్గాన్ని రాజకీయాల కోసం వాడుకుని, అధికారంలోకి వచ్చాక వారిని కూటమి ప్రభుత్వం వదిలేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో అమలైన కాపు సంక్షేమ పథకాలను (Kapu Welfare Schemes) రద్దు చేసినప్పుడు మాట్లాడని పవన్, ఇప్పుడు కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ (Lockup Death) విషయంలో బాధితుల పక్షాన నిలబడకుండా చంద్రబాబును రక్షించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది.

  • వైసీపీ కూట‌మి ప్రభుత్వం ముందు పెట్టిన 10 సూటి ప్రశ్నలు ఇవే
  • కాపు యువకుడు సాయికృష్ణను అసలు ఎవరు అదుపులోకి తీసుకున్నారు?
  • ఎవరి ఆదేశాల మేరకు ఈ అరెస్టులు జరిగాయి?
  • నిందితులను అదుపులోకి తీసుకున్నప్పుడు వారి కుటుంబాలకు కనీస సమాచారం ఎందుకు ఇవ్వలేదు?
  • పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఎలా ప్రాణాలు కోల్పోయాడు?
  • మరణం తర్వాత శవాల విషయంలో అంతటి గోప్యత పాటించి, మాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
  • ద‌ళిత‌ యువకుడు క్రాంతికుమార్ తండ్రి చేసిన ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ ఎందుకు జరపడం లేదు?
  • దళిత, బలహీన వర్గాల కుటుంబాల ఆవేదనపై కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
  • ఈ దారుణాలపై హోంమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారు?
  • డీజీపీ ఎందుకు పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచడం లేదు?
  • విజయవాడ పోలీస్ కమిషనర్ పాత్రపై వస్తున్న ప్రశ్నలకు సమాధానం ఏంటి?

సినిమా కెమెరాల ముందు మాట్లాడే డైలాగులకు థియేటర్లలో చప్పట్లు కొట్టొచ్చు, కానీ మీడియా కెమెరాల ముందు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే ప్రజల నుంచి వేటు తప్పదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. తిట్లతో లాకప్ డెత్‌ల ఉదంతాలను ప్రజలు మర్చిపోతారని అనుకుంటే అది రాజకీయ అజ్ఞానమే అవుతుంది.

రాష్ట్రంలో నడవాల్సింది చట్టమా? లేక ‘రెడ్‌బుక్ రాజ్యాంగమా’? (Red Book Constitution) ప్రభుత్వం బాధితుల పక్షాన ఉందా? లేక తప్పు చేసిన అధికారుల పక్షాన ఉందా? అనే ప్రశ్నలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ పదునైన ప్రశ్నలపై కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment