రాజధాని అమరావతిలో నిర్వహించిన ‘చిత్రకళా వీధి’ ప్రారంభోత్సవ ప్రాంగణంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గన్‌మెన్‌కు, జనసేన నాయకులు, కార్యకర్తలకు నడుమ తీవ్ర వాగ్వివాదం, తోపులాట, దాడి జరగడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అసలేం జరిగింది?
చిత్రకళా వీధి ప్రారంభోత్సవం అనంతరం మంత్రి కందుల దుర్గేష్, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌తో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించేందుకు వెళ్తున్నారు. ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు భద్రత బాధ్యతల్లో ఉన్న గన్‌మెన్, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌ను ముందుకు వెళ్లకుండా అడ్డుకుని పక్కకు నెట్టివేశారు.
సహచర నాయకుడిని సెక్యూరిటీ సిబ్బంది నెట్టివేయడంతో ఆగ్రహానికి గురైన జనసేన కార్యకర్తలు, మంత్రి గన్‌మెన్లు వెంటనే స్పందించారు. డిప్యూటీ స్పీకర్ గన్‌మెన్‌తో తీవ్రంగా వాగ్వివాదానికి దిగారు. అతన్ని నెట్టివేస్తూ దాడికి యత్నించారు.
ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వివాదం ముదరడంతో ప్రాంగణమంతా అరుపులు, కేకలతో హోరెత్తిపోయింది. ఆగ్రహంతో రగిలిపోయిన జనసేన కార్యకర్తలు డిప్యూటీ స్పీకర్ గన్‌మెన్‌ను పక్కకు తోసేసి, దాడికి యత్నించడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో గొడవ
— Telugu Feed (@Telugufeedsite) August 8, 2026
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ముందే గొడవ
స్టాల్స్‌ను తిలకించడానికి వస్తున్న సమయంలో మంత్రి దుర్గేష్, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌ను అడ్డుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ గన్‌మెన్
జనసేన నాయకుడు శ్రీనివాస్‌ను నెట్టివేయడంతో గన్‌మెన్‌తో… pic.twitter.com/DdzA0WzjiW









టీడీపీ నేర్పిన “సంస్కారం” ఇదేనా?