ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ముఖ్యంగా వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై పోలీసుల చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓటింగ్‌లో పాల్గొనకుండా చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీకి చెందిన కీలక నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేస్తున్నారనే విమర్శలు ప్రజలనుంచి వినిపిస్తున్నాయి.
వైఎస్సార్ జిల్లా పులివెందులను చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసినట్టుగా అర్ధమవుతోంది. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ అడ్డుకుంది. అధికార పార్టీ అరాచకాలను, ఎన్నో ఆంక్షలు ఛేదించి దాఖలు చేసిన 20 వార్డుల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా కుట్ర చేస్తోందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని కీలక నేతలను అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మంది వైసీపీ నాయకులు రిమాండ్‌కు వెళ్లగా, మరో నలుగురిని రిమాండ్‌కు పంపేందుకు పోలీసులు సిద్ధం చేసినట్లు సమాచారం. అదేవిధంగా మరో ఆరుగురు ప్రస్తుతం పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారు.
రిమాండ్‌కు వెళ్లినవారి వివరాలు:
- ఇరిగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి
- తడిక మధుసూదన్ రెడ్డి (సింహాద్రిపురం)
- వెన్నపూస రామ్మోహన్ రెడ్డి అలియాస్ బాబు (సింహాద్రిపురం)
- షేక్ మొహమ్మద్ ఉల్లా (సింహాద్రిపురం)
- వెంకట రమణారెడ్డి (కసునూరు)
- పప్పుల బాబ్జిరెడ్డి (కసునూరు)
- అంకెవానిపల్లె భాస్కర్ రెడ్డి
- కులాయి నాయక్ (కణంపల్లి)
రిమాండ్‌కు పంపేందుకు సిద్ధం చేసిన వారి వివరాలు:
- నంద
- ఉలిమెళ్ళ జనార్దన్ రెడ్డి
- వేణుగోపాల్ రెడ్డి (ఉలిమెళ్ళ)
- కొండయ్య
ప్రస్తుతం పోలీస్‌స్టేషన్‌లో ఉన్న వారు:
- రంగాపురం మధు
- మారుతి రెడ్డి
- మహేష్ బాబు (సీయోనుపురం)
- చక్రపాణి (ఆర్యవైశ్య)
- హరి (సీయోనుపురం)
- ఇబ్రహీం
ఏపీ లో వీరు మాత్రమే కాకుండా, పోలీసుల నుంచి కేసులు నమోదవుతాయనే భయంతో మరో 900 మంది వరకు ఆందోళనకు గురై, కొందరు తమ సొంత గ్రామాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైసీపీ నాయకులు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలతో స్థానికంగా రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి హక్కు. అలాంటప్పుడు ఎన్నికల సమయంలో ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు భయాందోళనల మధ్య ఉండాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.








