ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురు ప్రయాణికులు గల్లంతు!

ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురు ప్రయాణికులు గల్లంతు!ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురు ప్రయాణికులు గల్లంతు!

Summarize with AI

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం కలకలం రేపింది. జోషిమఠ్ సమీపంలోని హతి పహాడ్ వెనుక ఉన్న చాయీ గ్రామ పరిసరాల్లో హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ట్రాన్స్ భారత్ కంపెనీకి చెందిన ఈ హెలికాప్టర్ ఫాటా నుంచి బద్రీనాథ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటన సమయంలో హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణికులు, పైలట్ సహా మొత్తం ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులను చంద్రకాంత్, రాజశ్రీ, దినేష్, ఆకాష్, అథర్వగా గుర్తించినట్లు సమాచారం. అయితే, వారి ప్రస్తుత పరిస్థితిపై అధికారికంగా స్పష్టత రాలేదు. హెలికాప్టర్ శకలాలు కూడా ఇంకా లభ్యం కాలేదు.

ప్రమాదం జరిగినట్లు భావిస్తున్న ప్రాంతంలో దట్టమైన మేఘాలు, వర్షం కురుస్తుండటంతో పాటు దృశ్యమానత తక్కువగా ఉంది. దీంతో హెలికాప్టర్ కూలిన ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడం సహాయక బృందాలకు సవాలుగా మారింది. స్థానిక యంత్రాంగం, విపత్తు నిర్వహణ సిబ్బంది, రెస్క్యూ బృందాలు బద్రీనాథ్‌, జోషిమఠ్‌ పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు మరో రెండు హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. ప్రయాణికులు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే విషయంపై అధికారుల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.

హెలికాప్టర్ ప్రమాదాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ధ్రువీకరించినట్లు సమాచారం. జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు. కాగా, అక్టోబర్ నెలలోనే చార్‌ధామ్ యాత్ర సమయంలో ప్రతికూల వాతావరణం, సాంకేతిక సమస్యల కారణంగా రెండు హెలికాప్టర్లు అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment