రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతపై హత్యాయత్నం!

రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతపై హత్యాయత్నం!

Summarize with AI

ఫ్లెక్సీ తొల‌గించ‌లేద‌ని వైసీపీ (YSRCP) నాయ‌కుడిపై జ‌న‌సైనికులు (Jana Sainiks) హ‌త్య (Murder) చేసేందుకు య‌త్నించారు. ఈ సంఘ‌ట‌న ప్ర‌జా రాజ‌ధానికి ఆనుకొని ఉన్న గుంటూరు జిల్లా (Guntur District తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో చోటుచేసుకుంది. రాళ్ల‌తో దారుణంగా కొట్టి.. ఇక‌ చ‌నిపోయాడ‌ని వెళ్లిపోగా, కొన ఊపిరితో ఉన్న వైసీపీ నాయకుడు సంకు రత్తయ్యను (Sanku Rattaiah) స్థానికులు గుర్తించి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ర‌త్త‌య్య కుటుంబ స‌భ్యులు, స్థానికుల‌ సమాచారం ప్రకారం.. రాత్రి వాకింగ్‌కు వెళ్లిన సంకు రత్తయ్యను (Sanku Rattaiah) కొందరు వ్యక్తులు అడ్డగించి రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ముఖం, తలపై తీవ్రంగా కొట్టి ఆయన మృతి చెందారని భావించి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర గాయాల‌తో కొట్టుమిట్టాడుతున్న ర‌త్త‌య్య‌ను స్థానికులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రత్తయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

రత్తయ్య తన ఇంటి ముందు వైసీపీ బ్యానర్లు (YSRCP Banners) ఏర్పాటు చేయగా, వాటిని తొలగించాలని జనసేన (Jana Sena) నాయకులు కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంపై 20 రోజుల క్రితం కూడా రత్తయ్య ఇంటిపై జనసేన నాయకులు దాడి చేశారని, ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అనంతరం సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాలని గ్రీవెన్స్‌లో కూడా ర‌త్త‌య్య‌ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఫ్లెక్సీ తొల‌గించ‌లేద‌ని ర‌త్త‌య్య‌పై రాత్రి మరోసారి దాడి జరిగిందని, ముందుగా ఫిర్యాదులపై పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని కుటుంబ స‌భ్యులు, స్థానికులు, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి దాడికి పాల్ప‌డిన జ‌న‌సేన నాయ‌కుల‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment