భారత్‌లో ఐఫోన్ 18 ప్రో సేల్స్.. ఆపిల్ స్టోర్ల వద్ద భారీ క్యూలు!

భారత్‌లో ఐఫోన్ 18 ప్రో సేల్స్.. ఆపిల్ స్టోర్ల వద్ద భారీ క్యూలు!

Summarize with AI

టెక్ దిగ్గజం ఆపిల్(Apple) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఫోన్ 18 ప్రో(iPhone 18 Pro), ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్(iPhone 18 Pro Max) మోడళ్ల విక్రయాలు భారత్‌లో(India) నేటి నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. కొత్త ఐఫోన్లను (New iPhones) మొదటి రోజునే సొంతం చేసుకునేందుకు టెక్ ప్రియులు చూపించిన ఆసక్తితో దేశవ్యాప్తంగా సందడి నెలకొంది.

స్టోర్ల వద్ద భారీ క్యూలు.. రాత్రంతా నిరీక్షణ
ఢిల్లీ, ముంబై, బెంగళూరులోని అధికారిక ఆపిల్ స్టోర్ల బయట కస్టమర్లు బారులు తీరారు. కొత్త ఐఫోన్ 18 ప్రో మోడళ్లను దక్కించుకునే ఉత్సాహంతో కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు రాత్రంతా స్టోర్ల వెలుపలే వేచి ఉండటం విశేషం. రూ.1,64,900 ధరపెట్టి ఆపిల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లను (Latest Flagship Phones) దక్కించుకోవడానికి ఫ్యాన్స్ ఎగబడటంతో స్టోర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించింది. అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త సిరీస్‌కు భారత్‌లో అద్భుతమైన ఆదరణ లభిస్తోంది.

ఆపిల్ స్టోర్ (Apple Store) వ‌ద్ద బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశ‌ల్ (Vicky Kaushal) ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ముంబై బీఆర్కే కాంప్లెక్స్‌లోని (BKC Complex) యాపిల్ స్టోర్‌లో నేరుగా ఐఫోన్ 18 కొనుగోలు చేసిన విక్కీ.. ఆ ఫోన్‌ను అన్ బాక్స్ చేశారు. సెల‌బ్రెటీ ఐఫోన్ స్టోర్‌కు వ‌చ్చి ఫోన్ కొనుగోలు చేసి, ఐఫోన్ 18 డివైజ్‌ను అన్‌బాక్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment