దానం నాగేందర్‌పై వేటు.. హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

దానం నాగేందర్‌పై వేటు.. హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

Summarize with AI

ఖైరతాబాద్ ఎమ్మెల్యే(Khairatabad MLA) దానం నాగేందర్‌పై(Danam Nagender) తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై(Petitions) విచార‌ణ కొన‌సాగించిన హైకోర్టు.. ఈ కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad) నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు 2024 ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వస్తుందని సంచ‌ల‌న తీర్పును వెల్ల‌డించింది.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) దానం నాగేందర్ బీఆర్ఎస్ (BRS) టికెట్‌పై ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Congress Party) ఫిరాయించారు. అంత‌టితో ఆగ‌కుండా, ఫిరాయింపుల చ‌ట్టానికి విరుద్ధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొన‌సాగుతూనే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ (Secunderabad) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy), బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Aleti Maheshwar Reddy) వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ను తిరస్కరించారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆగస్టు 21న తీర్పును రిజర్వ్ చేసింది. తొలుత సెప్టెంబర్ 16న తీర్పు ఇవ్వాల్సి ఉండగా, అనంతరం సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది. తాజాగా దానం నాగేంద‌ర్‌పై అన‌ర్హ‌త వేటు వేస్తూ శుక్రవారం తీర్పును వెలువరించింది.

ప్రజాస్వామ్య విజయం.. బీఆర్ఎస్
హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ స్పందించింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్య విజయం, ప్రజల విజయం అని పేర్కొంది. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపింది. స్పీకర్ గతంలో తీసుకున్న నిర్ణయం అన్యాయంగా ఉందని బీఆర్ఎస్ విమర్శించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ స్పీకర్‌కు అది కనిపించకపోవడం అన్యాయమని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.

మిగతా ఎమ్మెల్యేలపై కూడా న్యాయపోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ తెలిపింది. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ పార్టీనే అమలు చేయడం లేదని బీఆర్ఎస్ విమర్శించింది. దానం నాగేందర్ అనర్హత వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment