ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ(YSRCP) ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరసన ర్యాలీలు (Statewide Protest Rallies) విజయవంతమయ్యాయని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Y.S. Jagan Mohan Reddy) పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన నిరసన ప్రదర్శనల వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న జగన్.. ఉద్యమంలో పాల్గొన్న యువత(Youth), విద్యార్థులకు (Students) అభినందనలు తెలిపారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేశారు.
డీఎస్సీ పేపర్ లీకేజీ (DSC Paper Leakage), స్పోర్ట్స్ కోటా (Sports Quota) పేరిట జరిగిన అక్రమాలపై (Irregularities) రాష్ట్రవ్యాప్తంగా యువత ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. వైసీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలకు విశేష స్పందన లభించిందని, డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)వెంటనే రాజీనామా (Resignation) చేయాలని డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు వచ్చిన ప్రతి ఆరోపణపై సీబీఐతో(CBI) సమగ్ర విచారణ (Investigation) జరిపించాలని కోరారు. టీచర్ ఉద్యోగాల (Teacher Jobs) కోసం రాత్రింబవళ్లు కష్టపడిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం.. డీఎస్సీలో లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును దెబ్బతీసిందని జగన్ ఆరోపించారు. సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఇప్పటివరకు స్పందించలేదని విమర్శించారు.
అసలు సమస్యలపై సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలకు (Diversion Politics) పాల్పడుతున్నారని ఆరోపించారు. యువత డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జగన్ స్పష్టం చేశారు. యువత, విద్యార్థుల భాగస్వామ్యంతో వివిధ రూపాల్లో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. యువత, విద్యార్థుల న్యాయపోరాటంలో వైసీపీ(YSRCP) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలు… ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ Gen-Z ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది. ప్రజలతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన… pic.twitter.com/C0ZpLL2hC3
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2026







