9 నెలల గర్భిణికి తప్పని డోలీ నరకం.. ప‌వ‌న్‌ వేసిన‌ రోడ్లు ఎక్క‌డ‌..?

9 నెలల గర్భిణికి తప్పని డోలీ నరకం.. ప‌వ‌న్‌ వేసిన‌ రోడ్లు ఎక్క‌డ‌..?

Summarize with AI

కూటమి ప్రభుత్వం, పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలోని పంచాయతీరాజ్ శాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని, గిరిజన ప్రాంతాల రూపురేఖలు మార్చేశామని చేసుకుంటున్న ప్రచారాల వెనుక ఉన్న అసలు నిజం బ‌ట్ట‌బ‌య‌లైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనీస రహదారి సౌకర్యం లేక 9 నెలల నిండు గర్భిణిని 3 కిలోమీటర్లు డోలీపై మోసుకెళ్లాల్సి వచ్చిన దయనీయ ఉదంతం కూటమి ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి అద్దం పడుతోంది.

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం తలారుపాడు గ్రామానికి చెందిన కిల్లో నీలిమ అనే 9 నెలల గర్భిణికి శుక్రవారం ఉదయం పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆసుపత్రి వాహనం గానీ, అంబులెన్స్ గానీ వచ్చే వీలు లేకుండా పోయింది.

సమయానికి వైద్యం అందకపోతే ప్రాణాలకే ప్రమాదమని భావించిన ఆమె భర్త రాజు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో గర్భిణిని స్ట్రెచ్చర్‌ (డోలీ)పై 3 కిలోమీటర్ల దూరంలోని పొర్లుబంద వరకు కొండలు, గుట్టల నడుమ మోసుకెళ్లారు. అక్క‌డి నుంచి బొడ్డపాడు వరకు ఆటోలో తీసుకెళ్లి, అక్కడి నుంచి అంబులెన్స్‌లో లుంగపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తరలించారు. గ‌ర్భిణీ డోలీ మోత వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

పవన్‌, చంద్రబాబులపై గిరిజనుల తీవ్ర ఆగ్రహం
గిరిజన ప్రాంతాల్లో వేల కిలోమీటర్ల తారు రోడ్లు పూర్తి చేశామని జ‌న‌సేన‌ ప్రచారం చేసుకోవ‌డంపై గిరిజ‌నులు, నెటిజ‌న్లు విమర్శిస్తున్నారు. “రోడ్లే ఉంటే నిండు గర్భిణులను డోలీల్లో మోసే దయనీయ పరిస్థితి మాకెందుకు వస్తుంది?” అని తలారుపాడు గిరిజనులు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

ఏజెన్సీలో అనారోగ్యం పాలైనా, ప్రసవ సమయం వచ్చినా ఇప్పటికీ డోలీలే దిక్కవుతున్నాయని, ఏమీ చేయ‌క‌పోయినా.. ఏజెన్సీ ప్ర‌జ‌ల జీవితాల‌ను బాగుచేసిన‌ట్టుగా ప్రచారాలు చేసుకోవ‌డంపై ఆదివాసీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కూటమి పాలనలో మన్యంలో వైద్య రవాణా వ్యవస్థ పూర్తిగా పడకేసిందని, పాలకుల పట్టుదల ప్రజా సంక్షేమంపై కాక కేవలం ప్రచారాల పైనే ఉందనడానికి ఈ ఉదంతం నిదర్శనంగా నిలుస్తోందంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment