రాజకీయాల నుంచి త‌ప్పుకుంటున్నా.. – విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

రాజకీయాల నుంచి త‌ప్పుకుంటున్నా.. - విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Summarize with AI

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తాజా ప్ర‌క‌ట‌న ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. వైసీపీలో అగ్ర నాయ‌కుడిగా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని, రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. తన నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని, దాని వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని ఆయన తెలిపారు. ఇకపై తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు.

నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జ‌గ‌న్‌కి, త‌న‌ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకు సదా కృతజ్ఞుడిని అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment