తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ చేసింది టీడీపీ నేతే!

తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ చేసింది టీడీపీ నేతే!

Summarize with AI

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో భద్రతా లోపం బయటపడింది. మొదటి ఘాట్ రోడ్డులోని ఏడవ మైలు వద్ద నిత్య పూజలు అందుకుంటున్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయిన విష‌యం తెలిసిందే. తిరుమల భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తిన వెంట‌నే.. పోలీసులు రంగంలోకి దిగారు.

ఘాట్ రోడ్డులోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంజనేయస్వామి విగ్రహాన్ని చోరీ చేసిన వ్యక్తి పొట్నూరు యశ్వంత్ అనే టీడీపీ నేతగా స్పష్టమైంది. నిందితుడు యశ్వంత్ స్వస్థలం భీమిలి నియోజకవర్గంలోని టి. నగరపాలెం గ్రామంగా గుర్తించారు.

నిందితుడు పొట్నూరు యశ్వంత్.. టీడీపీ అగ్ర‌నేత‌ నారా లోకేష్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సహా పలువురు తెలుగుదేశం పార్టీ కీలక నేతలతో కలిసి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమై తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ నేత తిరుమ‌ల‌లో ఆంజ‌నేయ‌స్వామి విగ్ర‌హం చోరీకి పాల్ప‌డ‌డంపై ఆ పార్టీ నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీ నేర్పించిన విలువ‌లు ఇవేనా..? అని ప్ర‌శ్నిస్తున్నారు.

కేసును ఛేదించిన పోలీసులు నిందితుడు యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరిగే ఏడో మైలు స్థానంలోనే విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment