ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. అరుదైన రికార్డు

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. అరుదైన రికార్డు

Summarize with AI

చెన్నైలోని (Chennai)ఎంఏ చిదంబరం స్టేడియంలో(MA Chidambaram Stadium) సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్(East Zone Captain) ఇషాన్ కిషన్ (Ishan Kishan) అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. మ్యాచ్ రెండో రోజు డబుల్ సెంచరీ పూర్తి చేసిన ఇషాన్.. మొత్తం 301 బంతుల్లో 250 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.

సౌత్ జోన్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించిన ఇషాన్.. ఈ డబుల్ సెంచరీతో(Double Century) దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో(Duleep Trophy Final) 200కుపైగా పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఈస్ట్ జోన్ తరఫున 31 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా ఈ ఘనత సాధించడం ఇషాన్ కిషన్ రికార్డును మరింత ప్రత్యేకంగా మార్చింది. దులీప్ ట్రోఫీ ఫైనల్లో కెప్టెన్‌గా డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. గతంలో 1987లో అన్షుమన్ గైక్వాడ్ ఈ ఘనత సాధించాడు.

ఇషాన్ కిషన్‌కు ముందు దులీప్ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీలు సాధించిన బ్యాటర్లలో రామన్ లాంబా, అన్షుమన్ గైక్వాడ్, చెతేశ్వర్ పుజారా, యశస్వి జైస్వాల్ ఉన్నారు. 1987-88లో రామన్ లాంబా 320, అన్షుమన్ గైక్వాడ్ 216 పరుగులు చేయగా.. 2016-17లో చెతేశ్వర్ పుజారా 256 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 2022-23లో యశస్వి జైస్వాల్ 209 పరుగులు చేశాడు.

తాజాగా ఇషాన్ 250 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ 385/4తో నిలవగా, ఇషాన్ 111, కుమార్ కుశాగ్రా 63 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. వీరిద్దరూ 26.4 ఓవర్లలోనే 144 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో రోజు కూడా ఇషాన్ అదే జోరును కొనసాగించి డబుల్ సెంచరీ సాధించడంతో ఈస్ట్ జోన్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. ఈస్ట్ జోన్ ఇప్పటికే 600 పరుగుల మార్కును దాటింది.

Join WhatsApp

Join Now

Leave a Comment