తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన భావోద్వేగ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజా జీవితంలో రెండు దశాబ్దాల ప్రయాణం తన జీవితంలో ఓ మధుర అధ్యాయమని పేర్కొన్న ఆయన, ఈ ప్రయాణంలో ప్రతి అడుగులో తనకు అండగా నిలిచిన ప్రజలు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “లక్షల అక్షరాలతో రాసినా.. కోట్ల పదాలతో చెప్పినా తరగని మధుర జ్ఞాపకం ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం” అంటూ తన రాజకీయ ప్రయాణాన్ని భావోద్వేగంగా వివరించారు. మిడ్జిల్‌లో సాధారణ నాయకుడిగా ప్రారంభమైన తన ప్రయాణం నేడు ప్రజల ప్రేమతో “రేవంతన్న”(Revanth Anna)గా మారిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భవిష్యత్తులోనూ అదే నిబద్ధతతో ప్రజాసేవ కొనసాగిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో (Telangana Reconstruction) ఓ శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు. తన రాజకీయ జీవితానికి ప్రజల విశ్వాసమే అతిపెద్ద బలమని పేర్కొన్న ఆయన, #ZPTCToCM, #20YearsOfPoliticalJourney హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్‌ను ముగించారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా, పలువురు రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడుతున్నారు.









