కలియుగం పూర్తయ్యే సరికైనా అమరావతి నిర్మాణం (Amaravati Construction) పూర్తవుతుందా? అని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ప్రశ్నించారు. అమరావతిని వరల్డ్ క్లాస్ రాజధాని అని నమ్మబలికి, చివరికి ఒక చిన్న మున్సిపాలిటీగా (Municipality) మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ (YSRCP) సెంట్రల్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పేర్ని నాని మాట్లాడుతూ.. అమరావతి నేడు అంతులేని అప్పుల (Debts) కుప్పగా మారిందని, ఐదు కోట్ల ప్రజలపై ఈ అప్పుల భారాన్ని మోపడం వల్లే రాష్ట్రం ఆర్థికంగా వెనుకబాటుకు గురైందన్నారు.
ఇకనైనా అప్పులు తేవడం ఆపాలని వైఎస్ జగన్ (YS Jagan) మావిగన్ (MAVIGUN) అనే ప్రతిపాదన తీసుకువస్తే టీడీపీ(TDP) నేతలు కనీస విజ్ఞత లేకుండా దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం (Alliance Government) ప్రజలను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించారు.
వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (MAVIGUN) ప్రణాళికతోనే అసలైన అభివృద్ధి సాధ్యమని పేర్ని నాని(Perni Nani) చెప్పారు. దీనిపై కూటమి నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. అమరావతిలో కేవలం ఆఫీసుల నిర్మాణాలకే రూ.50 వేలు ఖర్చు పెడితే, ఇక మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. చదరపు అడుగుకు రూ.20 వేలు ఖర్చు చేయడం పచ్చి అవినీతి కాదా?.. చంద్రబాబు తన హెరిటేజ్ ఆఫీసును చ.అ.కు ఎంత చొప్పున కట్టించారో చెప్పాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం కట్టే భవనాలకు చదరపు అడుగుకు రూ.4 ఖర్చు చేస్తుంటే, చంద్రబాబు(Chandra Babu Naidu) రూ.20 వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు పేర్ని నాని. చంద్రబాబు ఎకరం రూ.4 కోట్ల చొప్పున ఐదు ఎకరాలు కొనుగోలు చేశారని, ఆ లెక్కన తెచ్చిన అప్పులు తీరాలంటే ఎన్ని వేల ఎకరాలు అమ్మాలో సమాధానం చెప్పాలన్నారు. 30 వేల ఎకరాలను రూ.50 లక్షల చొప్పున కొనుగోలు చేసి ఉంటే కేవలం రూ.15 వేల కోట్లతోనే సరిపోయేదన్నారు.
జనం లేని చోట స్టార్ హోటళ్లు (Star Hotels) ఎవరి కోసం కడుతున్నారని, అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహణ సంగతి దేవుడెరుగు కానీ, రైతుల(Farmers) జీవితాలతో ఆటలు ఆడవద్దని హెచ్చరించారు. పట్టిసీమలోని మోటార్ల కంటే అమరావతిలో నీళ్లు తోడే మోటార్ల కెపాసిటీ చాలా ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. సెంటు భూమి కూడా లేని లోకేష్(Lokesh) మనుషులకు రిటర్నబుల్ ప్లాట్లు (Returnable Plots) ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రాజధానిలో ఇళ్లు కట్టుకున్న చంద్రబాబు, మంత్రి నారాయణల(Narayana) వివరాలను ఎందుకు బ్లాక్ చేశారో చెప్పే ధైర్యం మంత్రులకు ఉందా అని నిలదీశారు.
రాజధానిలో రైతుల సమస్యలు, అవినీతిపై మాట్లాడితే వైసీపీ(YSRCP) శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అవినీతిని (Corruption) ఎండగడుతూ వచ్చే అన్ని విమర్శల వీడియోలను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. అసలు అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో, దానికి ఎంత ఖర్చు చేస్తున్నారో, ఎంత అప్పులు తెస్తున్నారో ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని డిమాండ్ చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ‘మోటివేటెడ్ డిజార్డర్స్'(Motivated Disorders ఉన్నాయని, అప్పటికప్పుడు కావాలని ఆయన వేషాలు మారుస్తుంటారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కాపులను కేవలం బకరాలను చేసి వాడుకుంటున్నారని చెప్పారు. కాపు నేతలమంతా లంచ్ మీటింగ్‌కు వెళ్తే కావాలనే తమపై తిట్టిస్తున్నారని, జనసేన బలహీనపడి కాపులంతా పక్కకు వెళ్తుండటంతో.. మళ్లీ వారిని జనసేన వైపు తిప్పుకోవడానికి ఈ కుతంత్రాలు పన్నుతున్నారని ఆరోపించారు. పవన్ సన్నిహితుడు హరిప్రసాద్‌కు బందరులో ఏం పని అని ప్రశ్నించారు.
యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ (Prashna Ravana) ను అడ్డం పెట్టుకుని వైసీపీ, జనసేన(Jana Sena) మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. రావణ్ విషయంలో చట్టాన్ని దుర్వినియోగం చేయడం తీవ్ర దుర్మార్గమన్నారు. కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే రావణ్‌పై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.
కృష్ణలంక (Krishnalanka) పోలీస్ స్టేషన్ టెర్రస్ (Police Station Terrace) మీద సాయికృష్ణను కాల్చేశారట. అక్కడ ఎముకలు, బూడిద దొరికినట్లు డ్రామాలు ఆడుతున్నారు. ఒక శవాన్ని పీఎస్ మీద కాల్చేస్తే చుట్టుపక్కల ఉన్న జనానికి వాసన రాదా? ఎవరిని రక్షించడానికి సిట్ (SIT) అధికారులు ఈ డ్రామాలు ఆడుతున్నారు? టాస్క్ ఫోర్స్, సీపీ, ఏసీపీలను సిట్ ఎందుకు విచారించలేదు? అని పేర్ని నాని ప్రశ్నించారు.
ఇద్దరిని చంపేసిన సీఐ నాగరాజు(CI Nagaraju) తనకు ప్రాణహాని ఉందని భయపడుతున్నాడని, అసలు ఆయన ఎవరిని చూసి భయపడుతున్నాడో చెప్పాలన్నారు. సీఐ స్థాయి అధికారి భయపడుతున్నాడంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.








