నా కొడుకు నీ అభిమాని.. పూర్తి నిజాలు తెలుసుకోకుండా నా కొడుకును క్రిమినల్ అంటావా..? అని పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) లాకప్‌డెత్ కేసు (Lockup Death Case) మృతురాలి తల్లి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో (Andhra Pradesh) సంచలనం సృష్టించిన సాయికృష్ణ (Sai Krishna) లాకప్ డెత్ కేసు విచారణ నేపథ్యంలో బాధిత తల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. మెజిస్టీరియల్ విచారణ (Magisterial Inquiry) ముందు శనివారం సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి (Vijayalakshmi) హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియా ముందు ఆమె ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా కొడుకు బూడిద నాకు అప్పగించాలి.. లేకపోతే.. నడిరోడ్డుపై పెట్రోల్ (Petrol) పోసుకుని తగలబెట్టేసుకుంటా అని కన్నీరు పెట్టుకున్నారు. కృష్ణలంక (Krishnalanka) టెర్రస్‌పై (Terrace) దొరికిన బూడిద తన కొడుకుదే అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆ బూడిద అసలు ఎవరిదో ఎవరికి తెలుసని ఆమె ప్రశ్నించారు. అది నా కొడుకుదే అని నమ్మకం ఏంటి? అక్కడ ఇంకెంత మందిని చంపారో ఎవరికి తెలుసు అని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు తన కొడుకును ఎందుకు చంపారో, దానికి కారణం ఏంటో స్పష్టంగా చెప్పాలని విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ కేసులో కేవలం నలుగురైదుగురిని మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారని, మిగిలిన వాళ్లను ఎందుకు అరెస్ట్(Arrest) చేయలేదని నిలదీశారు. ఈ కేసు వెనుక పెద్దోళ్లు ఎవరో ఉన్నారని, అందుకే తన కొడుకును అంతమొందించారని ఆరోపించారు.
తన కొడుకు సాయికృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు(Pawan Kalyan) పెద్ద అభిమాని అని విజయలక్ష్మి గుర్తుచేశారు. “నా కొడుకు నీ అభిమాని.. వాడిని క్రిమినల్ (Criminal) అంటావా? నా కొడుకు గురించి పవన్ కళ్యాణ్ పూర్తి నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. ఆ అమ్మాయితో ఉన్న కేసు ఏంటో అందరికీ తెలుసు.. ఆమె బహిరంగంగానే మాట్లాడింది. కానీ ఎన్నిసార్లు చెప్పినా వాళ్లు మళ్లీ అవే అబద్ధాలు మాట్లాడుతున్నారు. మేము కాపులం.. పవన్ కళ్యాణ్ కోసమే మేమంతా ఓట్లు(Votes) వేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించాం. కాపులం (Kapu Community) ఓట్లు వేసి గెలిపించినందుకు పవన్ కళ్యాణ్ మాకు బాగా బుద్ధి చెప్పారు” అంటూ తీవ్ర ఆవేదనతో పవన్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ సాయికృష్ణ తల్లి
— Telugu Feed (@Telugufeedsite) July 4, 2026
మేము కాపులం ఓట్లు వేసినందుకు పవన్ కళ్యాణ్ బాగా బుద్ధి చెప్పాడు
నా కొడుకు నీ అభిమాని.. వాడిని క్రిమినల్ అంటావా..
ఆ అమ్మాయితో కేసు ఏంటో అందరికీ తెలుసు.. ఆ అమ్మాయి బహిరంగంగా మాట్లాడింది..
ప్రెస్ మీట్ లో మాట్లాడుతారు..… https://t.co/yfOivCaZRI pic.twitter.com/Ffje8118Q9







