అప్పుల లెక్కలు తప్పైతే మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధం‍‍: జూపల్లి

అప్పుల లెక్కలు తప్పైతే మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధం‍‍: జూపల్లి

రాష్ట్ర అప్పుల అంశంపై తాను ఇంతకుముందు వెల్లడించిన లెక్కలకే కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు కాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను చెప్పిన లెక్క తప్పు అని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అలాగే కేటీఆర్, హరీశ్‌రావు, కేసీఆర్ ముగ్గురూ సోమాజిగూడకు వచ్చి ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. దీంతో అసలు నిజం ఎవరిదో ప్రజలకు తెలుస్తుందన్నారు.

బీఆర్ఎస్ నేతలు అప్పుల విషయంలో పరస్పర విరుద్ధమైన గణాంకాలు చెబుతున్నారని మంత్రి జూపల్లి విమర్శించారు. కేటీఆర్ ఒకసారి రూ.3.17 లక్షల కోట్లు, మరోసారి రూ.3.85 లక్షల కోట్లు అని చెప్పారని, హరీశ్‌రావు కూడా వేర్వేరు సందర్భాల్లో రూ.4.26 లక్షల కోట్లు, రూ.4.17 లక్షల కోట్లుగా పేర్కొన్నారని గుర్తుచేశారు. తాను చెప్పిన రూ.8.21 లక్షల కోట్ల అప్పుల లెక్కలకు కట్టుబడి ఉన్నానని, అవి తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. అదే విధంగా బీఆర్ఎస్ నేతలు చెప్పిన లెక్కలు తప్పని తేలితే వారు కూడా ప్రజలకు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేటీఆర్‌కు బహిరంగ లేఖను వాట్సాప్ ద్వారా పంపినట్లు మంత్రి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment