ఆస్తి వేలం.. బండ్ల గణేష్‌కు హైకోర్టులో షాక్‌

ఆస్తి వేలం.. బండ్ల గణేష్‌కు హైకోర్టులో షాక్‌

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు (Bandla Ganesh) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్‌లో(Jubilee Hills) ఆయనకు, ఆయన కుటుంబానికి ఉన్న విలువైన స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) వేలం (Auction) వేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు గతంలో బండ్ల గణేష్‌కు అనుకూలంగా డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది.

బండ్ల గణేష్ వ్యాపార సంస్థ‌ ‘శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్’(Sri Parameswara Poultry Farm Private Limited) పేరిట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. అయితే ఈ అప్పులను సకాలంలో చెల్లించకపోవడంతో జూబ్లీహిల్స్‌లోని బండ్ల గ‌ణేష్ ఆస్తిని రూ.8.50 కోట్లకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేసింది.

ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ బండ్ల గణేష్ హైదరాబాద్‌లోని డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ని ఆశ్రయించారు. డీఆర్‌టీ.. బండ్ల గణేష్‌కు అనుకూలంగా తీర్పునిస్తూ, వేలాన్ని రద్దు చేసింది. డీఆర్‌టీ ఇచ్చిన ఏకపక్ష ఆదేశాలపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు.

హైకోర్టు డివిజన్ బెంచ్ సుదీర్ఘ విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. డీఆర్‌టీ (DRT) పరిధి దాటి వ్యవహరించిందని తప్పుబడుతూ, దాని ఉత్తర్వులను కొట్టివేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిపిన ఆస్తి వేలం చట్టబద్ధమేనని, సబబేనని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో బండ్ల గ‌ణేష్‌కు షాకిచ్చిన‌ట్టు అయ్యింది.

Join WhatsApp

Join Now

Leave a Comment