TRS పేరు మార్చుకోవాల్సిందే.. కవితకు ఈసీ ఆదేశం

TRS పేరు మార్చుకోవాల్సిందే.. కవితకు ఈసీ ఆదేశం

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) సంచలనంగా మారిన కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నూతన రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS)కు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) షాకిచ్చింది. పార్టీ పేరును (Party Name) మార్చుకోవాలని స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) కవితకు అధికారికంగా లేఖ రాశారు.

రాబోయే 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించకపోతే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పార్టీ రిజిస్ట్రేషన్ (Registration) దరఖాస్తును పూర్తిగా క్లోజ్ చేస్తామని ఈసీ డెడ్‌లైన్ విధించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

గతంలో బీఆర్‌ఎస్‌గా(BRS) మారిన ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ని(TRS) గుర్తుకు తెచ్చేలా సంక్షిప్తంగా ‘TRS’ అనే అక్షరాలు వస్తుండటంతో, ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS)పేరుపై ప్రజల నుంచి, పలు రాజకీయ వర్గాల నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. గతంలో కేసీఆర్(KCR) నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీతో ప్రజలకు ఉన్న భావోద్వేగ అనుబంధం, గుర్తింపు దృష్ట్యా.. ఈ కొత్త పేరు గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కవిత ప్రతిపాదించిన పేరును మార్చక తప్పదని ఈసీ స్పష్టం చేసింది.

న్యాయపోరాటానికి సై..
కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India – ECI) ఇచ్చిన అల్టిమేటంపై (Ultimatum) తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈసీ నోటీసులపై ఆమె స్పందిస్తూ.. పార్టీ పేరుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఎవరో అభ్యంతరాలు వ్యక్తం చేశారనే సాకుతో పేరు మార్చమనడం సరికాదు. కొత్త పేర్లు ఇచ్చేది లేదు.. ఈసీ నిర్ణయంపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నాం అంటూ క‌విత చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment