పింఛన్ల దరఖాస్తుల్లో టీడీపీ కార్యకర్తల జోక్యం! (Video)

పింఛన్ల దరఖాస్తుల్లో టీడీపీ కార్యకర్తల జోక్యం!

Summarize with AI

కొత్త పింఛన్ల(New Pensions) కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తున్న వేళ మన్యం జిల్లాలోని(Manyam District) కురుపాం-2 గ్రామ సచివాలయంలో(Kurupam-2 Village Secretariat) ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియలో టీడీపీ(TDP) కార్యకర్తలు జోక్యం బ‌య‌ట‌ప‌డింది. సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ (Digital Assistant) సీటులో ఓ టీడీపీ ఉత్త‌మ‌ కార్యకర్త కూర్చొని దరఖాస్తులను నేరుగా అప్లోడ్ చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

కురుపాం-2 గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ విధులు నిర్వహించాల్సిన సీటులో టీడీపీ ఉత్త‌మ కార్యకర్త ప్రత్యక్షమయ్యాడు. సచివాలయ సిబ్బందిని పక్కకు పంపించి.. తనకు అనుకూలంగా ఉన్న వారి పేర్లతో పింఛన్ దరఖాస్తులను నమోదు చేసి, వాటిని అప్లోడ్ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల తరఫున వచ్చిన దరఖాస్తులను సుఖేశ్ చంద్ర పాండా (Sukesh Chandra Panda)అనే వ్యక్తి అప్లోడ్ చేస్తున్న‌ట్లు వీడియోలో క‌నిపిస్తోంది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు(Local Body Elections) ముందు కొత్త పింఛన్ల కోసం చంద్ర‌బాబు ప్రభుత్వం(Chandrababu Government) దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు తీసుకుని.. నిబంధనల ప్రకారం పరిశీలించి పింఛన్లు మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే కురుపాం-2 సచివాలయంలో మాత్రం టీడీపీ నేతలు సూచించిన వారి దరఖాస్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానికంగా రాజకీయ దుమారం రేగుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సేవలు అందించాల్సిన గ్రామ సచివాలయాల్లో అధికార పార్టీ కార్యకర్తల జోక్యం పెరిగిపోతోందని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. సచివాలయ సిబ్బంది నిర్వహించాల్సిన పనులను రాజకీయ పార్టీ కార్యకర్తలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని మండిప‌డుతున్నారు. పింఛన్ దరఖాస్తుల స్వీకరణ, నమోదు, అప్లోడ్ ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉంటే అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి.

సచివాలయ సిబ్బంది విధుల్లో టీడీపీ కార్య‌క‌ర్త‌ ఎందుకు జోక్యం చేసుకున్నారనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. త‌మ‌కు కావల‌సిన వారికి పింఛ‌న్ ద‌ర‌ఖాస్తుల‌ను అప్లోడ్ చేసి, నిజ‌మైన అర్హుల‌కు అన్యాయం చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పింఛ‌న్ల ల‌బ్ధిదారుల ఎంపిక ప్ర‌క్రియ పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాల‌ని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment