వంశీ న్యాయవాదికి వేధింపులు.. ఏసీపీపై సీపీకి ఫిర్యాదు

వంశీ న్యాయవాదికి వేధింపులు.. ఏసీపీపై సీపీకి ఫిర్యాదు

Summarize with AI

వైసీపీ(YSRCP) నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) తరఫున కేసులు వాదిస్తున్న న్యాయవాది డా. వి. దేవి సత్యశ్రీ (Dr. V. Devi Satyasri)విజయవాడ పోలీస్ కమిషనర్‌ను క‌లిశారు. విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్(Damodar) ఓ సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటూ తమపై ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును(Rajashekar Babu) కలిసి ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తమకు సంబంధం లేని ఓ సివిల్ వివాదంలో ఏసీపీ దామోదర్ జోక్యం చేసుకుంటున్నారని దేవి సత్యశ్రీ(Devi Satyasri) తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తరచూ సంబంధిత లోకేషన్‌కు రావాలని తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. సివిల్ వివాదాలకు సంబంధించి పోలీసుల జోక్యం ఎంతవరకు సమంజసమనే అంశాన్ని ఆమె తన ఫిర్యాదులో ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ (Vallabhaneni Vamsi)మీద నిఘా కోసం ఆయ‌న త‌ర‌ఫున న్యాయ‌వాది దేవి సత్యశ్రీ పొరుగింటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశార‌ని, వంశీ లాయ‌ర్ ఆఫీస్‌కు ఎన్నిసార్లు వ‌స్తున్నారో సీసీ టీవీల థ‌ర్డ్స్ యాప్స్ ద్వారా తెప్పించుకుంటున్నార‌ని, ఏసీపీ దామోదర్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏసీపీ దామోదర్‌పై న్యాయవాది చేసిన ఆరోపణలు ప్రస్తుతం ఫిర్యాదు దశలోనే ఉన్నాయి. ఈ ఆరోపణలపై పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎలాంటి విచారణ చేపడుతుంది? సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు సివిల్ వివాదంలో పోలీసుల జోక్యంపై న్యాయవాది చేసిన ఫిర్యాదు నేపథ్యంలో.. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. ఫిర్యాదుపై పోలీస్ శాఖ అధికారికంగా స్పందిస్తేనే ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment