దొంగ సర్టిఫికెట్లు.. ఫ్యామిలీ ప్యాకేజీలా డీఎస్సీ ఉద్యోగాలు

దొంగ సర్టిఫికెట్లు.. ఫ్యామిలీ ప్యాకేజీలా డీఎస్సీ ఉద్యోగాలు

Summarize with AI

ఏపీ (AP) మెగా డీఎస్సీ(Mega DSC) నియామకాల్లో వెలుగులోకి వ‌స్తున్న అక్ర‌మాలు(Irregularities) ఒక్కొక్క‌టి షాక్‌కు గురిచేస్తున్నాయ‌ని, సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) కుంభ‌కోణాల (Scams) చ‌రిత్ర‌లో డీఎస్సీ స్కామ్ ఆణిముత్య‌మ‌ని వైసీపీ (YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) సెలైర్లు పేల్చారు. స్పోర్ట్స్‌ కోటాలో(Sports Quota) అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, త‌న వాళ్ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు (Government Jobs) క‌ట్ట‌బెట్టేందుకు జీవోల (GOs) పేరుతో చంద్ర‌బాబు స‌ర్కార్ గేమ్ ఆడింద‌న్నారు. ‘ఏడుసార్లు వెరిఫికేషన్‌ చేశాకే నియామకాలు చేపట్టాం’ అని అధికారులు చెప్పడం కూడా వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నమేనని విమర్శించారు.

గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్‌ డీఎస్సీ స‌బ్జెక్ట్‌పై మాట్లాడారు. స్పోర్ట్స్‌ కోటా(Sports Quota), టెట్‌ అర్హతలు(TET Eligibility), సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌(Certificate Verification), డ‌బ్బుల‌కు ఉద్యోగాలు అమ్ముకోవ‌డం (Selling Jobs for Money) వంటి ఆరోప‌ణ‌ల‌పై ఒక్కో ఆధారం చూపిస్తూ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టారు.

టెట్‌ పాస్‌ కాకుండానే ఉద్యోగాలు
విశాఖపట్నంకు(Visakhapatnam) చెందిన యోగేశ్వరరావు(Yogeshwara Rao) ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌జీటీ ఉద్యోగం (SGT Job) పొందారని ఆరోపించారు. యోగేశ్వరరావుతో పాటు ఆయన సోదరికి కూడా ఉద్యోగం ఇచ్చారని, ఒకే కుటుంబానికి పోస్టులు కట్టబెట్టినట్లుగా వ్యవహారం ఉందని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) (SAAP)పాత్రపై కూడా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు.

ఖోఖో ఈవెంట్‌లో పేర్లే లేవు
యోగేశ్వరరావు(Yogeshwara Rao), మోహినీదేవి (Mohinidevi) పేర్లు తాము నిర్వహించిన ఖోఖో ఈవెంట్‌లో(Kho-Kho Event) లేవని తెలంగాణ ఖోఖో అసోసియేషన్‌ (Telangana Kho-Kho Association) స్పష్టం చేసిందని జగన్‌ తెలిపారు. అయినప్పటికీ వారు పోటీల్లో పాల్గొన్నట్లు చూపించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రగడ కల్యాణి(Pragada Kalyani) వ్యవహారాన్ని కూడా జగన్‌ ప్రస్తావించారు. ఆమె కబడ్డీ పోటీలో పాల్గొన్నట్లు సర్టిఫికెట్‌ సమర్పించినప్పటికీ.. 2003లో నాగార్జున యూనివర్సిటీలో(Nagarjuna University) సౌత్‌జోన్‌ కబడ్డీ పోటీలు జరిగినట్లు రికార్డులు ఉన్నాయని, దీంతో ఆమె సమర్పించిన సర్టిఫికెట్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

ఈడిగ ప్రభాకర్‌ విషయంలోనూ ప్రశ్నలు
ఈడిగ ప్రభాకర్‌ (Ediga Prabhakar) వ్యవహారంపైనా జగన్‌ ప్రశ్నలు సంధించారు. ప్రభాకర్‌ టెట్‌లో అర్హత సాధించలేదని, కనీస విద్యార్హత కూడా లేదని డీఈవో స్వయంగా వెల్లడించారని తెలిపారు. అలాంటప్పుడు ఆయనకు ఉద్యోగం ఎలా వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. టెట్‌ అర్హత, విద్యార్హత, స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల పరిశీలన వంటి కీలక అంశాల్లో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.

ఏడుసార్లు వెరిఫికేషన్‌ కూడా బోగస్సే
డీఎస్సీ నియామకాలపై ప్రశ్నలు తలెత్తిన సమయంలో అధికారులు నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను జగన్‌ ప్రస్తావించారు. అభ్యర్థుల సర్టిఫికెట్లను ఏడుసార్లు వెరిఫికేషన్‌ చేసిన తర్వాతే ఉద్యోగాలు ఇచ్చామని అధికారులు చెప్పారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు వివాదం ముదరడంతో కొందరు అభ్యర్థులు పలుమార్లు టెట్‌ రాసి ఉండవచ్చని, అందువల్ల వారికి ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చని వివరణలు ఇస్తున్నారని జగన్‌ విమర్శించారు. ఈ విధంగా అసలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ‘ఏడుసార్లు వెరిఫికేషన్‌’(Seven Times Verification) అన్న వాదన కూడా బోగస్‌ అని జగన్‌ వ్యాఖ్యానించారు. అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఎలా వచ్చాయి? స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లను ఎవరు పరిశీలించారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

లంచాలు తీసుకుని ఉద్యోగాలు
స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. లంచాలు (Bribes) తీసుకుని స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. జూడో పోటీలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని అధికారులు అంగీకరించారని పేర్కొన్నారు. ఏ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వడం, నకిలీ లేదా అనుమానాస్పద సర్టిఫికెట్ల ఆధారంగా నియామకాలు చేపట్టడం వంటి ఆరోపణలు తీవ్రమైనవని, వీటిపై సమగ్ర దర్యాప్తు అవసరమని అన్నారు.

ఏపీపీఎస్సీపై కూడా జగన్‌ ఆరోపణలు
డీఎస్సీతో(DSC) పాటు ఏపీపీఎస్సీ(APPSC)నియామకాలపైనా జగన్‌ కీలక ఆరోపణలు చేశారు. పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నించారని, ఇందుకోసం దొడ్డిదారిన జీవో నంబర్‌ 4 తీసుకురావాలని చూశారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో క్లియరెన్స్‌ పొందిన 814 పోస్టుల్లో 40 పోస్టులను పరీక్ష లేకుండానే భర్తీ చేయాలని ప్రయత్నించారని తెలిపారు. అయితే డీఎస్సీ వివాదం బయటకు రావడంతో ఆ ప్రయత్నం ఆగిపోయిందని జగన్‌ పేర్కొన్నారు.

సీబీఐతోనే విచారణ జరపాలి
డీఎస్సీ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగే విచారణపై తమకు నమ్మకం లేదని జగన్‌ అన్నారు. చంద్రబాబు(Chandrababu), లోకేశ్‌(Lokesh) వద్ద పనిచేసే అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయగలరా? అని ప్రశ్నించారు. అందుకే డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు న్యాయస్థానంలోనూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

బీజేపీ, జనసేన మౌనంపై జగన్‌ ప్రశ్నలు
డీఎస్సీ నియామకాలపై ఇంతటి వివాదం జరుగుతున్నప్పటికీ బీజేపీ(BJP), జనసేన(Jana Sena) స్పందించకపోవడంపైనా జగన్‌ ప్రశ్నించారు. తాను లేవనెత్తుతున్న అంశాలు సరైనవేనని భావిస్తే అన్ని పార్టీలు దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, జనసేన ఎందుకు స్పందించడం లేదో ఆ పార్టీలనే అడగాలని మీడియాకు సూచించారు. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న పార్టీలు కూడా ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని జగన్‌ డిమాండ్‌ చేశారు.

మొత్తంగా మెగా డీఎస్సీ నియామకాలపై స్పోర్ట్స్‌ కోటా, టెట్‌ అర్హతలు, సర్టిఫికెట్ల పరిశీలన, నియామక ప్రక్రియపై వైసీపీ లేవనెత్తుతున్న ప్రశ్నలు రాజకీయంగా మరింత వేడిని పెంచుతున్నాయి. ఆరోపణలపై ప్రభుత్వం, విద్యాశాఖ నుంచి వచ్చే వివరణలు, తదుపరి దర్యాప్తు చర్యలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment