కాంగ్రెస్‌తో పొత్తు లేదు.. మమతా కీల‌క‌ ప్రకటన

కాంగ్రెస్‌తో పొత్తు లేదు.. మమతా కీల‌క‌ ప్రకటన

Summarize with AI

పశ్చిమ బెంగాల్‌లో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు వాదనలతో ఉన్నా.. ఈ విషయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పూర్తి స్పష్టతను ఇచ్చారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని మమతా బెనర్జీ తెలిపారు. 2026లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ సహా ఎటువంటి పార్టీతోనూ పొత్తు లేదని ఆమె చెప్పడం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇండియా కూట‌మిని ఇది ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుంద‌ని ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమానాలు లేకుండా, నాలుగోసారి తిరిగి తమ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి (INDIA)తో కలిసి ఉంటే, బీజేపీని ఎదుర్కోవ‌డం క‌ష్టం అవుతుంద‌నేది ఆమె అభిప్రాయంగా వెల్ల‌డ‌వుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment