భారత్ చేతిలో చిత్తు.. పాకిస్థాన్‌కు ఐసీసీ బిగ్ షాక్!

భారత్ చేతిలో చిత్తు.. పాకిస్థాన్‌కు ఐసీసీ బిగ్ షాక్!

ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston) వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ (Women’s T20 World Cup) హై-వోల్టేజ్ పోరులో భారత్(India) చేతిలో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్‌కు(Pakistan) ఐసీసీ మరో షాక్ ఇచ్చింది. మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి అవసరమైన ఓవర్లను పూర్తి చేయడంలో విఫలమైన పాక్ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా (Fatima Sana) కూడా జట్టు చేసిన తప్పును అంగీకరించడంతో ఎలాంటి విచారణ లేకుండానే జరిమానా అమల్లోకి వచ్చింది. దీంతో ఓటమి బాధలో ఉన్న పాకిస్థాన్‌కు ఐసీసీ నిర్ణయం మరింత నిరాశ కలిగించింది.

ఇక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 170 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా, లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌ను కేవలం 106 పరుగులకే కట్టడి చేసి 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ అద్భుత ప్రదర్శనతో 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడమే కాకుండా మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (166) తీసిన బౌలర్‌గా కొత్త రికార్డు సృష్టించింది. ఆమెకు శ్రీ చరణి మూడు వికెట్లతో అండగా నిలవడంతో పాక్ జట్టు పూర్తిగా చేతులెత్తేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment