34 శాతం అమలు కాదని బాబుకు ముందే తెలుసా..?

34 శాతం అమలు కాదని బాబుకు ముందే తెలుసా..?

Summarize with AI

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజ‌ర్వేష‌న్ పెంపు జీవోల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు కొట్టేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చెల్లుబాటు కావ‌ని స్ప‌ష్టం చేసింది. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితి తీర్పులకు ఈ జీవోలు విరుద్ధమని ఏపీ ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇది అమలు కాదని తెలిసినా, కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు ఈ జీవోల పేరుతో బీసీల‌ను మ‌భ్య‌పెట్టేందుకు పొలిటిక‌ల్ గేమ్ ఆడుతున్నార‌ని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

ప్రచారార్భాటమా..?
మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న రాజ్యాంగ ధర్మాసన తీర్పులు అమలులో ఉన్నప్పటికీ, ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్ల ప్రకటన చేసి ఉత్తర్వులు ఇవ్వడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ముఖ్య కారణమని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడమే ఆలస్యం, సొంత పార్టీ క్యాడర్‌ను రంగంలోకి దించి తాను “బీసీ పక్షపాతి”నంటూ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేయించుకున్నారు.

కోర్టులో ఈ జీవోలు నిలబడవని ముందే అంచనా వేసి, కేవలం బీసీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికే ప్రభుత్వం ఈ “పబ్లిసిటీ స్టంట్” చేసిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రచారార్బాటమే పరమావధిగా మారిన చంద్రబాబు, బీసీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికే ఈ జీవోలను అస్త్రంగా వాడుకుంటున్నార‌ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీపై నిందలు వేసే వ్యూహమా?
మరోవైపు, ఈ వ్యవహారాన్ని ప్రతిపక్ష వైసీపీ రాజకీయ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. తాము బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావించినప్పటికీ వైసీపీ అడ్డుకుంద‌ని రేపు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్ర‌బాబు ప్రభుత్వం ముందస్తు స్కెచ్ వేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలోనూ తన అనుచరుడైన బిర్రు ప్రతాప్‌రెడ్డి ద్వారా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్లు వేయించి ప్రక్రియను అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదేనని, ఇప్పుడు మళ్లీ అదే తరహాలో అమలవని రిజర్వేషన్ కార్డుతో బీసీలను దారుణంగా మోసం చేశారని స్పష్టమవుతోందంటున్నారు చంద్ర‌బాబు రాజ‌కీయాల‌ను నిశితంగా ప‌రిశీలించే రాజ‌కీయ మేధావులు.

Join WhatsApp

Join Now

Leave a Comment