అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండ యువకుడి దుర్మరణం

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండ యువకుడి దుర్మరణం

Summarize with AI

ఉన్నత చదువుల కోసం అమెరికా(America) వెళ్లిన తెలంగాణ(Telangana) యువకుడు రోడ్డు ప్రమాదంలో(Road Accident) ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ జిల్లా మునుగోడు పట్టణానికి చెందిన సాయితేజ (Sai Teja) (25) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారం రోజుల క్రితమే ఉద్యోగం సాధించిన సాయితేజ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

అమెరికాలో కారులో(Car) ప్రయాణిస్తున్న సాయితేజకు అకస్మాత్తుగా జింక (Deer) అడ్డం వచ్చింది. దీంతో కారు జింకను ఢీకొట్టడంతో సాయితేజ వాహనాన్ని నిలిపివేశాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన వాహనాలు(Vehicles) అతని కారును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో సాయితేజకు తీవ్ర గాయాలయ్యాయి(Severe Injuries). వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన సాయితేజ వారం రోజుల క్రితమే ఉద్యోగం సాధించాడు. ఉద్యోగం(Job) వచ్చిన సంతోషాన్ని తల్లిదండ్రులతో పంచుకున్న కొద్దిరోజులకే అతని మరణవార్త అందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాయితేజ అకాల మరణంతో స్వగ్రామం మునుగోడులో విషాదఛాయలు అలుముకున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment