బాబు, లోకేష్‌తో మీటింగ్‌.. రాజీనామాలపై తగ్గేదేలేద‌న్న ఆది

బాబు, లోకేష్ మాటలు సమంజసంగా లేవు.. రాజీనామాలపై తగ్గేదేలే..

Summarize with AI

కడప జిల్లా పరిషత్ చైర్మన్ (Kadapa Zilla Parishad Chairman) పదవి వ్యవహారం అధికార కూటమిలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. జడ్పీ పీఠం కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Naidu), నారా లోకేష్ (Nara Lokesh) వ్యవహరించిన తీరును బీజేపీ(BJP) ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి (Adinarayana Reddy) తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు, లోకేష్‌తో రెండుసార్లు చర్చలు జరిపినా వారి మాటలు సమంజసంగా లేవని స్పష్టం చేశారు.

ఢిల్లీ పెద్దల (Delhi High Command) నుంచి స్పష్టత వచ్చే వరకు తన తమ్ముడి కుమారుల రాజీనామాలు (Resignations) కొనసాగుతాయని ప్రకటించారు. అవసరమైతే తాను కూడా ఎమ్మెల్యే(MLA) పదవికి రాజీనామా(Resignation) చేస్తానని హెచ్చరించారు. తాము అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు.

కూటమిలో స్పష్టత లేకుండా ఒకటి ప్రకటించి మరొకటి అమలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి(TDP) మెజారిటీ ఉందనే కారణంతో అన్ని నిర్ణయాలనూ ఆ పార్టీ నేతలే తీసుకుంటున్నారని, మిత్రపక్షమైన బీజేపీ(BJP) అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

జడ్పీ చైర్మన్ పదవి కేటాయింపులో చివరి నిమిషంలో జరిగిన పరిణామాలను ఆదినారాయణ రెడ్డి ప్రస్తావించారు. ఉదయం 11.40 గంటలకు జాబితా విడుదల కావడానికి ముందు 11.32 గంటలకు తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని చెప్పారు. అయితే చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చేశారని అసహనం వ్యక్తం చేశారు.

చంద్రబాబు, లోకేష్‌ను సంప్రదించిన తర్వాతే తాము పోటీలో నిలిచామని, పార్టీ అనుమతితోనే ముందుకు వెళ్లామని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ (Madhav) సూచన మేరకే పోటీ చేశామని, అది తమ సొంత నిర్ణయం కాదని తెలిపారు. ఈ వ్యవహారాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని, తమతో పార్టీ పెద్దలు ఏకీభవించారని తెలిపారు.

సమగ్ర వివరాలతో కూడిన నివేదికను తీసుకుని ఢిల్లీకి రావాలని పార్టీ పెద్దలు సూచించారని చెప్పారు. ఢిల్లీలో చర్చలు జరిగి స్పష్టత వచ్చే వరకు రాజీనామాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఢిల్లీ పెద్దలతో చర్చలు సక్రమంగా జరగకపోతే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. స్పష్టత రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

ధర్మవరంలో(Dharmavaram) బీజేపీ మండల అధ్యక్షుడి పదవికి సంబంధించిన వ్యవహారంలోనూ టీడీపీ ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. అనంతపురంలో టీడీపీ సహకారం అందించకపోవడంతో బీజేపీ ఓటమి చెందిందని చెప్పారు.

కూటమి విజయానికి బీజేపీ చేసిన సహాయానికి ప్రతిఫలంగా టీడీపీ ఎన్ని పదవులు ఇచ్చినా తక్కువేనని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం(Central Government) రాష్ట్రంలో కూటమిని బలోపేతం చేసేందుకు సహకరిస్తుంటే, రాష్ట్రంలో మాత్రం బీజేపీకి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

మంత్రి పదవి కోసం తాను బ్లాక్‌మెయిల్ (Blackmail) చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆదినారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ ఘాటుగా స్పందించారు. తన తోక కత్తిరిస్తామని చంద్రబాబు అన్నట్లు కొన్ని టీవీ చానళ్లు కథనాలు ప్రసారం చేశాయని ప్రస్తావించారు.

కూటమిలో విభేదాలు కేవలం బీజేపీకే పరిమితం కాలేదని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. జనసేనలోనూ(Jana Sena) ఇదే పరిస్థితి ఉందని, అయితే ఆ పార్టీ నేతలతో తాము ఈ అంశంపై చర్చించలేదని తెలిపారు. కూటమి పార్టీల మధ్య స‌మన్వయ లోపం ఉందని చెప్పారు.

కడప జడ్పీ చైర్మన్ పదవి విషయంలో మొదలైన వివాదం ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ నిర్ణయాలపై బీజేపీ ఎమ్మెల్యే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసే స్థాయికి చేరింది. రాజీనామాలను కొనసాగిస్తామని, అవసరమైతే తాను కూడా ఎమ్మెల్యే పదవిని వదులుకుంటానని ఆదినారాయణ రెడ్డి ప్రకటించడంతో కూటమిలో పదవుల పంపకం మరింత చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment