స్పీకర్ అయ్యన్నపై రూ.వెయ్యి కోట్ల దోపిడీ ఆరోపణ!

స్పీకర్ అయ్యన్నపై రూ.వెయ్యి కోట్ల దోపిడీ ఆరోపణ!

Summarize with AI

ఇటీవ‌ల ఏపీ శాస‌న‌స‌భ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ టార్గెట్‌గా తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అసెంబ్లీకి రాక‌పోవ‌డంపై, వైసీపీ ఓట‌మిపై జ‌గ‌న్ ఓడిపోయాడు కానీ చ‌చ్చిపోలేద‌ని చేసిన వ్యాఖ్య‌లు స‌గ‌టు పౌరుడికి కూడా విస్మ‌యం క‌లిగించేలా ఉన్నాయి. తాజాగా న‌ర్సీప‌ట్నంలో జ‌రిగిన జ‌య‌హో బీసీ స‌భ‌లోనూ అయ్య‌న్న‌పాత్రుడు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతోంది. ఒక మాజీ ముఖ్య‌మంత్రిని పనికిమాలిన సన్యాసి అంటూ మాట్లాడ‌డంపై వైసీపీ శ్రేణులు మండిప‌డుతున్నారు.

స్పీక‌ర్ స్థానంలో ఉన్న వ్య‌క్తి ప‌రుష ప‌ద‌జాలంతో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో అయ్యన్నపై వైసీపీ నేత, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు అవినీతికి పాల్పడుతూ భారీగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘లెట్ రైట్’ పేరుతో ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు దోచుకున్నారని, మరో రూ.వెయ్యి కోట్లు దోచుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారని సంచలన ఆరోపణలు చేశారు.

ఇటీవల ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ని టార్గెట్‌గా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలపై కూడా ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. నర్సీపట్నంలో జరిగిన ‘జయహో బీసీ’ సభలోనూ మాజీ ముఖ్యమంత్రిని ‘పనికిమాలిన సన్యాసి’ అంటూ మాట్లాడటంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జగన్ గురించి మాట్లాడే అర్హత స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేదని ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు.

నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఉమాశంకర్ గణేష్.. నియోజకవర్గంలో ఆయన చేస్తున్న అవినీతి, దోపిడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయ్యన్నపాత్రుడు పెద్ద దోపిడీదారుడని ఆరోపించిన ఆయన.. నియోజకవర్గంలో విచ్చలవిడిగా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. ఇప్ప‌టికే వెయ్యి కోట్ల రూపాయ‌ల‌కు పైగా దోచుకున్నార‌ని ఆరోపించారు.

బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారని.. ఇప్పటివరకు ఒక్కరికైనా ఇచ్చారా? అని నిలదీశారు. బీసీ సబ్‌ప్లాన్‌కు రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారని గుర్తుచేస్తూ.. బీసీ సభ పేరుతో ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు.

బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది మాజీ సీఎం వైఎస్ జగన్‌ అని ఉమాశంకర్ గణేష్ అన్నారు. జగన్ తన ప్రభుత్వ హయాంలో ఇద్దరు బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా బీసీలకు మంత్రి పదవులు, రాజ్యసభ పదవులు జగన్ కట్టబెట్టారని పేర్కొన్నారు. బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని అన్నారు.

బీసీలకు ప్రాధాన్యత విషయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉమాశంకర్ గణేష్ ప్రశ్నించారు. చంద్రబాబు ఎంతమంది బీసీలను రాజ్యసభకు పంపించారో చెప్పగలరా? ఎంతమంది బీసీలను ఉప ముఖ్యమంత్రులను చేశారో చెప్పగలరా? అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సవాల్ విసిరారు. బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే టీడీపీ ప్రభుత్వం.. ఆచరణలో బీసీలకు ఎంత రాజకీయ ప్రాధాన్యత కల్పించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment