యాపిల్ కొత్త ఐఫోన్ మోడల్స్‌ను (Apple iPhone Models) మార్కెట్లోకి తీసుకురావడంతో పాటు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పలు ఐఫోన్ మోడల్స్ ధరలను కూడా సవరించింది. సాధారణంగా కొత్త మోడల్ విడుదలైన తర్వాత పాత మోడల్స్ ధరలు తగ్గుతుంటాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా యాపిల్ పాత మోడల్స్ ధరలను కూడా పెంచింది. గ్లోబల్ మార్కెట్లో(Global Market) మెమరీ చిప్స్(Memory Chips), ఇతర విడిభాగాల ధరలు పెరగడం ఇందుకు కారణంగా చెబుతోంది.
ధరల పెంపుతో(Price Hike) ఐఫోన్ 16 ధర సుమారు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పెరిగి రూ.89,900కు చేరింది. ఐఫోన్ 17 ధర సుమారు రూ.17 వేల మేర పెరిగి రూ.99,900కు చేరగా.. ఐఫోన్ 17e ధర సుమారు రూ.15 వేల పెంపుతో రూ.79,900కు చేరింది.
ఇక ఐఫోన్ ఎయిర్ మోడల్ (iPhone Air Model) ధర అత్యధికంగా సుమారు రూ.30 వేల వరకు పెరిగి రూ.1,49,900కు చేరింది. భారత్‌లో(India) ఇప్పటికే ఈ మోడల్‌కు అమ్మకాల పరంగా ఆశించిన స్థాయిలో స్పందన లేదనే ప్రచారం ఉండగా.. తాజా ధరల పెంపు విక్రయాలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.
కొత్త లాంచ్‌ల నేపథ్యంలో ఐఫోన్ 15 సహా కొన్ని పాత మోడల్స్‌పై రిటైల్ డిస్కౌంట్లు(Retail Discounts), క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను(Cashback Benefits) కూడా యాపిల్ తగ్గించింది. దీంతో ఐఫోన్ 15 ధర స్టోర్లలో సుమారు రూ.5 వేల వరకు పెరిగినట్లయింది. ఐఫోన్ 16 ప్లస్ బేస్ వేరియంట్ ధర కూడా సుమారు రూ.5 వేల మేర పెరిగి రూ.79,900 నుంచి లభిస్తోంది.
మరోవైపు ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ వంటి ప్రీమియం మోడల్స్‌ను యాపిల్ అధికారికంగా నిలిపివేసింది. దీంతో పాత మోడల్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు కూడా గతంతో పోలిస్తే ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త ఐఫోన్‌ల విడుదలతో పాటు పాత మోడల్స్ ధరల సవరణతో యాపిల్ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సమాచారం.








