“ఎద్దు (Bull) ఏడిస్తే వ్యవసాయం (Agriculture) ఉండదు.. రైతు (Farmer) ఏడిస్తే రాజ్యం (Kingdom) ఉండదు” అంటూ రైతుల సంక్షేమమే రాష్ట్రాభివృద్ధికి పునాదని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ (B. Chandrakumar) వ్యాఖ్యానించారు. రాజధాని (Capital) పేరిట చంద్రబాబు ప్రభుత్వ (Chandrababu Government) భూసేకరణపై (Land Acquisition) చంద్రకుమార్ అసహనం వ్యక్తం చేశారు. నిన్న రాజధాని ప్రాంతం పెనుమాకలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్న ఆయన.. ఇవాళ విజయవాడలో (Vijayawada) ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చ వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన “బలవంతపు భూసేకరణ – చట్టపరమైన అంశాలు” (Forced Land Acquisition-Legal Aspects) సదస్సులో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి పేరుతో సారవంతమైన వ్యవసాయ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం రైతుల జీవితాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుకు భూమితో తల్లి–బిడ్డల బంధం (Mother-Child’s Relationship) ఉంటుందని, రెండెకరాల రైతు భూమిని తీసుకుంటే ఆ కుటుంబం ఎలా జీవిస్తుందని ప్రశ్నించారు.
విజయవాడ పరిసర ప్రాంతాల్లో బంజరు భూములు ఉండగా, రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూములను ఎందుకు తీసుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వం నిలదీశారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న భూముల్లో(Lands) అభివృద్ధి పనులు పూర్తి కాకపోయినా, కొత్త భూముల సేకరణ చేపట్టడం సమంజసం కాదన్నారు.
రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులను వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, పొలాల చుట్టూ చెరువులు తవ్వడం, విద్యుత్ నిలిపివేయడం, బోర్లను ధ్వంసం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.
రెండు, మూడు పంటలు పండే భూములు తీసుకుంటే చట్టం ప్రకారం భూమికి బదులుగా భూమి ఇవ్వాలని, మార్కెట్ విలువకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామని చెప్పినా అవి ఎక్కడ ఉన్నాయో స్పష్టత లేదని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు.
పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, స్థానికులకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఉపాధి భరోసా కల్పించాలని కోరారు.







