ఏపీలో దారుణం.. విద్యార్థిని జుట్టుప‌ట్టుకొని ఈడ్చుకెళ్లిన పోలీసులు (Video)

ఏపీలో దారుణం.. విద్యార్థిని జుట్టుప‌ట్టుకొని ఈడ్చుకెళ్లిన పోలీసులు

Summarize with AI

స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం, త‌మ డిమాండ్ల సాధ‌న కోసం విద్యార్థులు (Students) రోడ్ల (Roads) మీద‌కు వ‌చ్చి ఆందోళ‌న చేయ‌డం కొత్తేమీ కాదు. ప్ర‌భుత్వాలు (Governments) మంచిచేస్తే జై(Hail) కొడ‌తారు.. మొండికేస్తే డౌన్ డౌన్(Down Down) అంటారు. ఇది ఏ రాష్ట్రంలోనైనా స‌హ‌జం. కానీ, ఏపీలో అత్యంత దారుణమైన సంఘ‌ట‌న ప్ర‌జ‌ల‌ను విస్మ‌యానికి గురిచేస్తోంది.

స్టైఫండ్‌ (Stipend) చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగిన పారా మెడికల్‌ విద్యార్థులపై (Paramedical Students) పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తిరుపతిలోని(Tirupati) అలిపిరి ప్రాంతంలో నిరసన (Protest) చేపట్టిన విద్యార్థులపై పోలీసుల వ్య‌వ‌హార‌శైలి వ్య‌వ‌స్థ (Police Conduct System) ప‌నితీరును విమ‌ర్శ‌ల్లోకి లాగింది. రోడ్డుపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న పారా మెడిక‌ల్ విద్యార్థినిని పోలీసులు జుట్టు (Hair) పట్టుకుని ఈడ్చుకెళ్లిన (Dragged) అత్యంత పాశ‌విక ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పారా మెడికల్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు తమకు రావాల్సిన స్టైఫండ్‌ (Stipend) చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద ఎత్తున రోడ్ల మీద‌కు వ‌చ్చి నిరసన చేప‌ట్టారు. తమ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్‌ను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. ఈ క్రమంలో అలిపిరి వద్ద విద్యార్థులను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. బ‌ల‌వంతంగా జీపులు, ఆటోల్లో ఎక్కించి స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

విద్యార్థినుల (Female Students) పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరపాల్సింది పోయి.. విద్యార్థినులను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ‘ప్రజల పట్ల పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?’ అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (National Human Rights Commission) స్పందించి.. సుమోటోగా (Suo Motu) కేసు నమోదు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇది ఆంధ్ర‌రాష్ట్ర‌మా(Andhra State).. లేక సౌత్ బిహారా(South Bihar)…? అని ప్ర‌శ్నిస్తున్నారు. విద్యార్థుల ప‌ట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై సమగ్ర విచారణ జరపాలని, అధికారుల‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యార్థి సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment