తెలంగాణ శాసనసభలో(Telangana Legislative Assembly) 22-A నిబంధనలు(22-A Rules), రెవెన్యూ సమస్యలపై(Revenue Issues) జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దాదాపు 125 ఏళ్ల తర్వాత రెవెన్యూ శాఖలో తమ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని అన్నారు.
గత పదేళ్ల పాలనలో జరిగిన అంశాలు సభలో చర్చకు వస్తాయనే భయంతోనే బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. ‘ధరణి’ (Dharani) చట్టం ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా అప్పటి అధికార పార్టీ (Ruling Party) నాయకులు, కేడర్‌కు లబ్ధి చేకూర్చేలా రూపొందించారని విమర్శించారు. రెవెన్యూ డేటా, ధరణి కాంట్రాక్టు విషయంలోనూ నాటి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని ఆరోపించారు.
ధరణి లోపాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులు ఇబ్బందులు (Thousands of Farmers) ఎదుర్కొన్నారని పొంగులేటి పేర్కొన్నారు. సొంత భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోలేక కొందరు రైతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అన్నారు. వీఆర్వో(VRO), వీఆర్ఏ(VRA) వ్యవస్థలను గత ప్రభుత్వం రద్దు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరించిందని తెలిపారు.
ధరణి సమస్యల పరిష్కారం కోసం గతంలో 2.46 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, భూభారతి ప్రక్రియ (Bhu Bharati Process) అనంతరం ఆ సంఖ్య 5.46 లక్షలకు చేరిందని మంత్రి వెల్లడించారు. దరఖాస్తులను కారణం లేకుండా తిరస్కరించకుండా పారదర్శకంగా పరిశీలించి, బాధిత రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.








