ప్రభుత్వ బడుల్లో (Government Schools) విద్యార్థుల (Students) సంఖ్య పెరుగుతోందని, విద్యారంగంలో(Education Sector) సమూల మార్పులు తీసుకొచ్చామని చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయి గణాంకాలు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితిని చూపిస్తున్నాయి. ఏపీలో రెండేళ్ల వ్యవధిలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య భారీగా తగ్గడంతో పాటు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు కూడా గణనీయంగా పడిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ యుడైస్ (UDISE) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
యుడైస్ లెక్కలను ప్రస్తావిస్తూ చంద్రబాబు పాలనలో ఆయన తనయుడు మంత్రిగా ఉన్న విద్యా శాఖలో ప్రభుత్వ విద్యారంగం పతనావస్థకు చేరిందని వైసీపీ విమర్శిస్తోంది.
యుడైస్ (UDISE) వివరాల ప్రకారం.. రెండేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తం 972 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు (Aided Schools) తగ్గాయి. ఇందులో 778 ప్రభుత్వ పాఠశాలలు, 194 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నట్లు పేర్కొంది. గత ఏడాదిలోనే 644 పాఠశాలలు తగ్గాయని తెలిపింది.ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222కు తగ్గగా.. ఎయిడెడ్ పాఠశాలలు 991 నుంచి 797కు పడిపోయాయి.
పాఠశాలల సంఖ్యతో పాటు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య కూడా భారీగా తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,116 మంది విద్యార్థులు ఉండగా.. 2025-26 నాటికి ఆ సంఖ్య సుమారు 34.93 లక్షలకు పడిపోయింది.
అంటే రెండేళ్ల వ్యవధిలో సుమారు 5.86 లక్షల మంది విద్యార్థులు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య 13.74 శాతం తగ్గగా, ఇదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 6.30 శాతం పెరిగింది. ఈ గణాంకాలను చూపిస్తూ.. “మరి దీన్ని ప్రభుత్వ బడిలో కొత్త శకం అంటారా?” అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని (Chandrababu Government) వైసీపీ(YSRCP) ప్రశ్నించింది.
గత వైసీపీ ప్రభుత్వం ‘నాడు-నేడు’(Nadu-Nedu) కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, ఫర్నిచర్, ఆర్వో ప్లాంట్లు, రన్నింగ్ వాటర్ టాయిలెట్లు, స్మార్ట్ టీవీలు, డిజిటల్ వసతులు కల్పించిందని వైసీపీ గుర్తుచేసింది. ప్రస్తుతం ఆ వసతులను సక్రమంగా నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించింది. మధ్యాహ్న భోజన పథకం (Mid-Day Meal Scheme), నాడు-నేడు ద్వారా ఏర్పాటైన మౌలిక వసతుల నిర్వహణపై సరైన దృష్టి పెట్టకపోవడం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణమవుతోందని వైసీపీ ఆరోపిస్తోంది.
మెగా పీటీఎంలు.. ప్రచారం తప్ప ఫలితం ఏది?
సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), విద్యా శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లు నిర్వహిస్తూ, ఫొటోలు, పత్రికా ప్రకటనలతో ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా మార్చేశామని ప్రచారం చేసుకుంటున్నారని వైసీపీ విమర్శించింది. కానీ, యుడైస్ గణాంకాల్లో కనిపిస్తున్న విద్యార్థుల నమోదు, పాఠశాలల సంఖ్య మాత్రం ప్రభుత్వ ప్రచారానికి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయని పేర్కొంది.
“చంద్రబాబు, లోకేష్ పాలనలో ప్రభుత్వ విద్యారంగం పతనావస్థకు చేరింది” అంటూ వైసీపీ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. చంద్రబాబు ప్రభుత్వం పైకి గవర్నమెంట్ విద్య గురించి డైలాగులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దీనావస్థలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యలో కనిపిస్తున్న మార్పుల నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ విద్య పరిస్థితిపై మరోసారి రాజకీయ చర్చ మొదలైంది.
ప్రభుత్వ స్కూళ్లో కొత్త శకం కాదు… చంద్రబాబు అబద్ధాల శకం!🚨
— YSR Congress Party (@YSRCParty) July 25, 2026
ప్రైవేట్ స్కూళ్ల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారని చంద్రబాబు చేసిన ప్రకటన పచ్చి అబద్ధమని కేంద్ర విద్యాశాఖ UDISE+ అధికారిక లెక్కలే నిరూపిస్తున్నాయి.
📊 ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు… pic.twitter.com/07hb7VGXAq








