పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో(Tirumala) భద్రతా లోపం బయటపడింది. మొదటి ఘాట్ రోడ్డులోని (Ghat Road) ఏడవ మైలు వద్ద నిత్య పూజలు అందుకుంటున్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని (Lord Hanuman Idol) అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. తిరుమల భద్రతా వ్యవస్థపై (Security System) అనేక ప్రశ్నలు తలెత్తిన వెంటనే.. పోలీసులు రంగంలోకి దిగారు.
ఘాట్ రోడ్డులోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు(Police) చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంజనేయస్వామి విగ్రహాన్ని చోరీ చేసిన వ్యక్తి పొట్నూరు యశ్వంత్ (Potnuru Yashwanth) అనే టీడీపీ(TDP)నేతగా స్పష్టమైంది. నిందితుడు యశ్వంత్ స్వస్థలం భీమిలి నియోజకవర్గంలోని టి. నగరపాలెం గ్రామంగా గుర్తించారు.
నిందితుడు పొట్నూరు యశ్వంత్.. టీడీపీ అగ్రనేత నారా లోకేష్(Nara Lokesh), మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సహా పలువురు తెలుగుదేశం పార్టీ(TDP) కీలక నేతలతో కలిసి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమై తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ నేత తిరుమలలో ఆంజనేయస్వామి (Lord Hanuman) విగ్రహం చోరీకి (Idol Theft) పాల్పడడంపై ఆ పార్టీ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేర్పించిన విలువలు ఇవేనా..? అని ప్రశ్నిస్తున్నారు.
కేసును ఛేదించిన పోలీసులు నిందితుడు యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరిగే ఏడో మైలు స్థానంలోనే విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు.
బ్రేకింగ్
— Telugu Feed (@Telugufeedsite) July 23, 2026
తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ చేసిన వ్యక్తి టీడీపీ నేతగా గుర్తింపు
పోలీసులు వెల్లడించిన వివరాలతో స్పష్టమైన వైనం
పొట్నూరు యశ్వంత్ అనే వ్యక్తి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చోరీ చేసినట్టు గుర్తింపు
నిందితుడు, టీడీపీ నేత యశ్వంత్ స్వస్థలం భీమిలి నియోజకవర్గం, టి.… https://t.co/hedoKlTCYz pic.twitter.com/kXVfZGrY9J








‘చిన్నోడు.. పెద్దోడు’.. టీడీపీ మీడియాపై అంబటి సెటైర్లు