20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సీఎం రేవంత్.. ట్వీట్ వైరల్

20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సీఎం రేవంత్.. ట్వీట్ వైరల్

తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన భావోద్వేగ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజా జీవితంలో రెండు దశాబ్దాల ప్రయాణం తన జీవితంలో ఓ మధుర అధ్యాయమని పేర్కొన్న ఆయన, ఈ ప్రయాణంలో ప్రతి అడుగులో తనకు అండగా నిలిచిన ప్రజలు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “లక్షల అక్షరాలతో రాసినా.. కోట్ల పదాలతో చెప్పినా తరగని మధుర జ్ఞాపకం ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం” అంటూ తన రాజకీయ ప్రయాణాన్ని భావోద్వేగంగా వివరించారు. మిడ్జిల్‌లో సాధారణ నాయకుడిగా ప్రారంభమైన తన ప్రయాణం నేడు ప్రజల ప్రేమతో “రేవంతన్న”(Revanth Anna)గా మారిందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భవిష్యత్తులోనూ అదే నిబద్ధతతో ప్రజాసేవ కొనసాగిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో (Telangana Reconstruction) ఓ శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు. తన రాజకీయ జీవితానికి ప్రజల విశ్వాసమే అతిపెద్ద బలమని పేర్కొన్న ఆయన, #ZPTCToCM, #20YearsOfPoliticalJourney హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్‌ను ముగించారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా, పలువురు రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment