చంద్రబాబు నేతృత్వంలోని(Chandrababu Naidu) కూటమి ప్రభుత్వంపై (Alliance Government) వైసీపీ(YSRCP) మరో భారీ విజయాన్ని సాధించింది. ఒకే ఒక్క హెచ్చరికతో ఇటీవల ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను (Government Medical Colleges Privatization) అడ్డుకొని ప్రభుత్వంపై పైచెయ్యి సాధించిన వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy). తాజాగా పంచదార్ల విషయంలో ప్రభుత్వమే దిగొచ్చేలా చేశారు. వైసీపీ పోరాటంతో పంచదార్లను(Panchadarla) నో మైనింగ్ జోన్‌గా (No Mining Zone) ప్రకటిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖపట్నం జిల్లాలోని పంచదార్ల కొండకు చాలా విశిష్టత ఉంది. పాండవులు అజ్జాత వాసం చేసినప్పుడు తలదాచుకున్న పంచదారుల కొండను వారు దాహార్తిని తీర్చడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు సృష్టించారని అంటారు. అంత చరిత్ర, పవిత్రమైన ఆ ప్రదేశంలో కూటమి నేతల కనుసన్నల్లో అక్రమ మైనింగ్ (Illegal Mining) చేస్తూ, ఏకంగా కొండకే గుండుగా మారిన విషయం తెలిసిందే.

పంచదార్లలో జరుగుతున్న అక్రమ మైనింగ్(Illegal Mining), ప్రకృతి విధ్వంసంపై వైసీపీ కొంతకాలంగా పోరాటం చేస్తోంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన పంచధారలను, కొండ ప్రాంతాన్ని మైనింగ్ పేరుతో ధ్వంసం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి సైతం ఫిర్యాదులు చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్(CM Ramesh), జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ (Sundarapu Vijay Kumar) ప్రమేయంతోనే కొండను తవ్వేస్తున్నారని, వెంటనే మైనింగ్ ఆపేయాలని డిమాండ్ చేశారు.

పంచదార్ల కొండ పరిరక్షణ కోసం జూలై నుంచి వైసీపీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. అనకాపల్లిలో భారీ బైక్, కార్ల ర్యాలీ నిర్వహించి ‘ఛలో పంచదార్ల’ (Chalo Panchadarla)కార్యక్రమాన్ని చేపట్టింది. వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ(Botcha Satyanarayana), గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ తదితరులు ర్యాలీలో పాల్గొని మైనింగ్ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంచదార్ల కొండను భారీగా తవ్వుతున్నారంటూ వైసీపీ విడుదల చేసిన డ్రోన్ దృశ్యాలు కూడా అప్పట్లో వైరల్‌గా మారాయి.

పంచదార్ల ప్రాంతంలో మైనింగ్‌ను పూర్తిగా నిలిపివేసి, కొండను ‘నో మైనింగ్ జోన్’(No Mining Zone)గా ప్రకటించాలని వైసీపీ డిమాండ్ చేసింది. పంచదార్ల కొండను కాపాడుకునేందుకు వైసీపీ చేపట్టిన ఆందోళనలకు ప్రభుత్వం దిగొచ్చింది. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 2.153 హెక్టార్ల పరిధిని నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పంచదార్ల ప్రాంతాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.








