ఏపీలో దారుణం.. బాలికను వివస్త్రగా చేసి దొంగ బాబాల పూజలు

ఏపీలో దారుణం.. బాలికను వివస్త్రగా చేసి దొంగ బాబాల పూజలు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) బాలికపై (Minor Girl) దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బు(Money), ఐశ్వర్యం(Wealth) వస్తాయంటూ మూఢనమ్మకాలను నమ్మబలికి ఓ బాలికను పలుమార్లు వివస్త్రగా కూర్చోబెట్టి పూజల పేరుతో వేధించిన ఘటన అనంతపురంలో(Anantapur) కలకలం రేపింది. సుమారు ఆరు నెలలుగా బాలికను నరకయాతనకు గురిచేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం నగరంలో నివాసం ఉండే ఓ వ్యక్తికి మహాలక్ష్మి(Mahalakshmi) అనే మహిళ పరిచయమైంది. హోటల్ వ్యాపారం ద్వారా భారీగా లాభాలు రావాలంటే బాలికను వివస్త్రగా పూజలో కూర్చోబెట్టాలని, అలా చేస్తే డబ్బు, ఐశ్వర్యం కలిసి వస్తాయని ఆమె నమ్మబలికింది. మొదట ఈ విషయానికి అంగీకరించని బాధిత కుటుంబం.. మహాలక్ష్మి మాటలకు చివరకు ఒప్పుకుంది.

బాలికను ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి హేమంత్ (Hemanth) అనే వ్యక్తి పూజల పేరుతో వివస్త్రగా కూర్చోబెట్టి, అసభ్యకరంగా తాకుతూ వేధింపుల‌కు గురిచేశాడు. తొలిసారి చేసిన పూజలు ఫలించలేదని, మరోసారి పూజ చేయాలని ఈ నెల 8న హేమంత్ తన కుమారుడు బాలసుబ్రహ్మణ్యం(Balasubrahmanyam), విజయ్ కుమార్(Vijay Kumar) అనే మరో వ్యక్తిని తీసుకొచ్చి బాలికను మళ్లీ వివస్త్రగా కూర్చోబెట్టి పూజలు చేశారు.

అయినా పూజలు సక్రమంగా జరగలేదని చెప్పి.. మరుసటి రోజు బాలికను, ఆమె తల్లిని కడపకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ వెంకటేష్ యాదవ్ (Venkatesh Yadav) అనే వ్యక్తి వద్దకు తీసుకెళ్లి పూజల పేరుతో బాలికను చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితులు ఆరోపించారు. 11వ తేదీన‌ మరోసారి పూజ చేయాలంటూ బాలికను, ఆమె తల్లిని నిందితులు కారులో తీసుకెళ్తుండగా స్థానికులు గమనించారు.

అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విషయం తెలుసుకున్నారని గుర్తించిన నిందితులు.. బాలికను, ఆమె తల్లిని కారులో నుంచి దింపేసి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు వల్లూరు పోలీసులు తొలుత జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బుధవారం కేసును వల్లూరు పోలీస్ స్టేషన్ నుంచి అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

బాలికపై జరిగిన వేధింపులకు సంబంధించి హేమంత్, బాలసుబ్రహ్మణ్యం, వెంకటేష్ యాదవ్‌తో పాటు వారికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహాలక్ష్మి, సాయిప్రణవ్‌లపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment