నేపాల్‌ జల విలయంలో ఇషా ఫౌండేషన్ స‌భ్యులు.. జ‌గ్గీ క‌న్నీరు

నేపాల్‌ జల విలయంలో ఇషా ఫౌండేషన్ స‌భ్యులు.. జ‌గ్గీ క‌న్నీరు

Summarize with AI

నేపాల్ (Nepal) జలప్రళయంలో(Flood Disaster) పెరుగుతున్న మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 208 మృతదేహాలు లభ్యమ‌య్యాయి. వరదల్లో 1500 మందికి పైగా గల్లంతు అయిన‌ట్టుగా నేపాల్ మీడియా(Nepal Media) ప్ర‌క‌టించింది. గల్లంతైన వారిలో 823 పర్యాటకులు కాగా, వీరిలో 300 మంది భారతీయులు ఉన్నార‌ని స‌మాచారం. కాగా, ప‌ర్యాట‌కుల్లో ఇషా ఫౌండేషన్‌కు (Isha Foundation) 77 మంది గల్లంతు అయిన‌ట్టుగా ఆ సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) ప్ర‌క‌టించారు. మీడియా ఎదుట జ‌గ్గీ వాసుదేవ్ కన్నీరు పెట్టుకున్నారు.

నేపాల్‌లో ఇషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘సేక్రెడ్ వాక్స్’ (Sacred Walks) కైలాస్ మానససరోవర్ యాత్రకు (Kailash Mansarovar Yatra) వెళ్లిన కొంతమంది పర్యాటకులు, వాలంటీర్ల (Volunteers)ఆచూకీపై ఆందోళన నెలకొన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై సద్గురు మీడియాతో మాట్లాడుతూ.. తమ గ్రూప్ కాఠ్మాండుకు తిరుగు ప్రయాణంలో చైనా ఇమ్మిగ్రేషన్ సెంటర్ (China Immigration Center) వద్ద ఉన్న సమయంలో చివరిసారిగా సమాచారం అందిందని సద్గురు తెలిపారు.

నిన్న ఉదయం 9:05 గంటలకు గ్రూప్ లీడర్ ప్రవీణ్‌తో మాట్లాడినట్లు చెప్పారు. “ఇమ్మిగ్రేషన్ ప్రారంభిస్తున్నాం” అని ప్రవీణ్ (Praveen) చెప్పిన 10 నిమిషాల్లోనే కమ్యూనికేషన్ తెగిపోయిందని వెల్లడించారు. ఆ సమయంలో నేపాల్ వైపు మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు సద్గురు తెలిపారు. భారీ వరదల కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా పనిచేయకపోవడంతో అక్కడి నుంచి సమాచారం పొందడం కష్టంగా మారిందన్నారు.

నేపాల్ వైపు తమ వాలంటీర్లు ఉన్న పట్టణం భారీ వరదల ధాటికి పూర్తిగా కొట్టుకుపోయిందని సద్గురు తెలిపారు. ఈ విపత్తు ప్రభావానికి సుమారు 80 మంది గురైనట్లు చెప్పారు. రిమోట్ ప్రాంతం కావడం, ప్రకృతి విపత్తు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి సమాచారం నెమ్మదిగా వస్తోందని వివరించారు.

ఇషా ఫౌండేషన్‌కు (Isha Foundation) చెందిన 77 మంది పిల్గ్రిమ్స్ నేపాల్‌లో చిక్కుకుపోయారని సద్గురు వెల్లడించారు. వీరు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్, యూకే, ఆసియా తదితర ప్రాంతాలకు చెందినవారని తెలిపారు. మొత్తం 19 దేశాలకు చెందిన వారు ఈ బృందంలో ఉన్నారని, వారిలో చాలామంది భారతీయ మూలాలు కలిగినవారని చెప్పారు.

పరిస్థితిపై సమాచారం, సహాయం కోసం భారత్, నేపాల్‌కు సంబంధించిన 19 ఎంబసీలను సంప్రదించినట్లు సద్గురు వెల్లడించారు. ప్రస్తుతం చైనా అధికారుల నుంచి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని, రేపు ఉదయం వరకు పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నట్లు సద్గురు తెలిపారు.

నేపాల్‌లోని ఆకస్మిక వరదల నేపథ్యంలో కైలాస్ మానససరోవర్ యాత్రకు వెళ్లిన పర్యాటకుల పరిస్థితిపై వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. అధికారుల నుంచి పూర్తి సమాచారం అందిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment