కార్య‌క‌ర్త‌లకు అండ‌గా.. వైసీపీ డిజిట‌ల్ బుక్ ప్రారంభం

డిజిటల్ బుక్ పోర్టల్ ప్రారంభించిన వైఎస్ జగన్..

Summarize with AI

నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు, బాధిత ప్ర‌జ‌ల‌కు అండ‌గా వైసీపీ డిజిట‌ల్ బుక్ ప్రారంభ‌మైంది. ప్ర‌తిప‌క్ష వైసీపీ (YCP)లో అన్యాయానికి గుర‌వుతున్న క్యాడ‌ర్ కోసం ఆ పార్టీ అధినేత, మాజీ (Former)ముఖ్య‌మంత్రి (Chief Minister) వైఎస్ జ‌గ‌న్(YS Jagan) గ‌తంలో చెప్పిన‌ట్లుగానే డిజిట‌ల్ బుక్‌ (Digital Book)కు శ్రీ‌కారం చుట్టారు. అన్యాయానికి గురైన వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌మ ఫిర్యాదుల‌ను ఈ డిజిట‌ల్ బుక్‌లో అప్లోడ్ చేస్తే.. అధికారంలోకి వ‌చ్చాక దాని ప‌ని అది చేసుకుంటూ వెళ్తుంద‌ని, అన్యాయానికి గురైన వారికి న్యాయం జ‌రిగేలా ఈ డిజిట‌ల్ బుక్ చూసుకుంటుంద‌ని క్యాడ‌ర్‌కు భ‌రోసా ఇచ్చారు.

నేడు తాడేపల్లి (Tadepalli) కేంద్ర కార్యాలయం (Central Office)లో మాజీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ పార్టీ విస్తృతస్ధాయి (Wide Level) సమావేశం (Meeting) జరిగింది. ఈ కార్యక్రమంలో ‘డిజిటల్‌ బుక్’ (Digital Book)పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను జగన్ ప్రారంభించారు. కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరిగినా వివరాలు అప్‌లోడ్ చేయండి అని పిలుపునిచ్చారు. Digitalbook.weysrcp.com పేరుతో పోర్టల్ లాంచ్ చేశారు జగన్.

ఇది https://digitalbook.weysrcp.com/auth/phoneలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. ప్రతి సంఘటనను శాశ్వత డిజిటల్ డైరీలో నమోదు చేసి భద్రపరుస్తారు. వెబ్‌సైట్‌తో పాటు, 040-49171718 ద్వారా IVRS కాల్ సౌకర్యం ఏర్పాటు చేసింది వైసీపీ. దీని ద్వారా కార్మికులు మరియు బాధితులు ఫోన్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. ఈ డిజిటల్ బుక్ కు ఒక క్యూఆర్ కోడ్ (QR Code) కూడా ఉంది. నేరుగా ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, తమ సమస్యలకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. అనంతరం ఆ వివరాలను నమోదు చేయాలి. జగన్ 2.0 ప్రభుత్వంలో తమ కార్యకర్తలను, నేతలను అన్యాయంగా వేధించిన వారిని వదిలిపెట్టేది లేదని పలు సందర్భాల్లో జగన్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment