కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా (Resignation) పరిణామంతో ఏపీలో (AP) మెగా డీఎస్సీ (Mega DSC) వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ (NEET Question Paper Leak) వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకున్న నేపథ్యంలో.. ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహణపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కూడా రాజీనామా చేయాలనే డిమాండ్‌ను వైసీపీ(YSRCP) మరింత బలంగా తెరపైకి తెచ్చింది.
ఈ నేపథ్యంలో నారా లోకేష్‌ను (Nara Lokesh) లక్ష్యంగా చేసుకుని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే (NDA) చెప్పే నైతిక ప్రమాణాలు (Moral Standards) ఏపీలోనూ అమలవుతాయా? అని ప్రశ్నించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి కేంద్ర మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం ఎన్డీయే ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీక అయితే.. ఇప్పుడు అదే ప్రమాణాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనూ (Andhra Pradesh) పాటించాలని జగన్ డిమాండ్ చేశారు.
ఏపీలో దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్‌ను (Teacher Candidates Future) పణంగా పెట్టారని, డీఎస్సీ నిర్వహణలో అంతులేని అక్రమాలు (Irregularities) జరిగాయని జగన్ ఆరోపించారు. ఈ వ్యవహారానికి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యత వహించాల్సిందేనన్నారు.
“డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేస్తారా? ఎన్డీయే ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలకు కట్టుబడి ఉంటారా?” అంటూ జగన్ ప్రశ్నించారు. లోకేష్ రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు (Nara Chandrababu Naidu) తన కుమారుడి మంత్రి పదవిని కాపాడేందుకు జవాబుదారీతనాన్ని పక్కనపెడతారా? అంటూ జగన్ మరో ప్రశ్న సంధించారు.
ఇప్పటికే డీఎస్సీ నిర్వహణపై సీబీఐ విచారణ (CBI Investigation) జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా జగన్ నేరుగా రాజీనామా అంశాన్ని ప్రస్తావించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.










అంబటితో బోండా ముచ్చట.. టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్!