ఆనంద్ దేవరకొండ–వైష్ణవి చైతన్య రిలేషన్‌షిప్‌ రూమర్స్‌పై క్లారిటీ..

ఆనంద్ దేవరకొండ–వైష్ణవి చైతన్య రిలేషన్‌షిప్‌ రూమర్స్‌పై క్లారిటీ..

Summarize with AI

‘బేబీ’ (Baby)సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జోడీ ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya). ఈ సినిమాలో వీరిద్దరూ హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. బేబీలో ఆనంద్, వైష్ణవి మధ్య కెమిస్ట్రీ (Chemistry) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ జంట మరోసారి కలిసి నటించిన సినిమా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’(Epic – First Semester). ‘90s’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ (Aditya Hasan) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయిసౌజన్య(Sai Soujanya) నిర్మాతలు. యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఎపిక్ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘బేబీ’ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కనిపించిన కెమిస్ట్రీ కారణంగా.. వీరిద్దరూ నిజ జీవితంలో కూడా రిలేషన్‌షిప్‌లో(Relationship) ఉన్నారంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై ఇద్దరూ స్పందించలేదు. ఇప్పుడు ఎపిక్ వస్తుండంతో ఆ రూమర్స్(Rumours) మరింత ఎక్కువయ్యాయి. అందుకు కారణం.. కథలో రిలేషన్‌షిప్‌నకు సంబంధించిన బోల్డ్ కంటెంట్, కిస్ సీన్స్ ఉండటంతో సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. ఎపిక్ ప్రమోషన్స్‌లో హీరో ఆనంద్ దేవరకొండకు ఇదే విషయంపై ఓ ప్రశ్న ఎదురైంది. వైష్ణవి చైతన్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ జరిగిన ప్రచారంపై స్పందిస్తూ.. తమ మధ్య ఉంది కేవలం స్నేహం (Friendship) మాత్రమేనని స్పష్టం చేశాడు.

వైష్ణవి చైతన్య, తాను మంచి స్నేహితులమని(Good Friends).. అంతకు మించి తమ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదని ఆనంద్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. ఇద్దరం కలిసి రెండో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రచారం జరిగి ఉండొచ్చని చెప్పాడు. దీంతో ఇన్నాళ్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రూమర్స్‌కు చెక్ పడినట్లైంది. బేబీ తర్వాత ఆనంద్, వైష్ణవి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఎపిక్ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ హిట్ పెయిర్ మరోసారి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment